Narendra Modi: సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. మళ్లీ వచ్చేది ఎన్డీయే సర్కార్‌ అని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కూడా ఎన్డీయే సర్కార్‌ వస్తుందని, డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Counting Date: ఎన్నికల సంఘం పొరపాటా? దిద్దుబాటా..? ఓట్ల లెక్కింపు తేదీ మార్పు


పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ఎన్డీయే కూటమి ఆదివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగం చేశారు. 'నా ఆంధ్రా కుటుంబసభ్యులకు నమస్కారాలు' అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభించినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. 'మూడోసారి అధికారంలోకి వచ్చి ధృడమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్‌ 4వ తేదీన వస్తున్నాయి. ఈసారి ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు రావాలి. అభివృద్ధి చెందిన ఏపీని చూడాలనుకుంటే ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వచ్చేలా మీరు సహకరించాలి' అని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read: Petrol Diesel Prices: వాహనదారులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు


 


ఈ సందర్భంగా టీడీపీ, జనసేనతో పొత్తు విషయమై మోదీ స్పందిస్తూ.. 'ఎన్డీయే కూటమికి ప్రాంతీయ భావాలతోపాటు జాతీయ భావాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తుంది. ఎన్డీయేలో చేరే వారి సంఖ్య పెరిగితే బలం పెరుగుతుంది. బాబు, పవన్‌ కల్యాణ్‌ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి చేసిన సేవలను గుర్తించాలి' అని సూచించారు. ఎన్డీయే కూటమి లక్ష్యం వికసిత భారతదేశమని పునరుద్ఘాటించారు. ఏపీలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం వస్తేనే వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమని చెప్పారు. ప్రతిపక్ష ఇండియా కూటమిపై విమర్శలు చేస్తూ.. 'సిద్ధాంతాలు కలవకున్నా.. కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరాయని.. ఇండియా కూటమికి దేశం మీద చిత్తశుద్ధి లేదు' అని మోదీ విమర్శించారు.


ఈ సభలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావును ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. మహానాయకుల సేవలను కీర్తించారు. 'ఏపీ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌ పార్టీ దెబ్బతీయగా.. ఎన్టీఆర్‌ కాపాడారు. పేదల కోసం ఎన్టీఆర్‌ ఎంతో తపించారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా రూ.వంద వెండి నాణేం విడుదల చేశాం. రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్‌ తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారు. తెలుగువారి ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావుకు ఎన్డీయే ప్రభుత్వం 'భారతరత్న'తో గౌరవించింది' అని గుర్తుచేశారు. 


ఏపీ సీఎం జగన్‌పై కూడా మోదీ విమర్శలు చేశారు. 'ఏపీలో ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపేయాలి. ఏపీ ప్రభుత్వం ఎన్నో అవినీతి కార్యక్రమాలకు పాల్పడింది. మంత్రులు అవినీతి మీదే దృష్టి సారించారు. ఈ ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడింది. జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు వేర్వేరు కాదు రెండూ ఒక్కటే. రెండు పార్టీల్లోని నాయకత్వాలు ఇద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చాయి. ఏపీ అభివృద్ధి జరగాలంటే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమికి ఓటు వేయాలి. ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలి' అని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో వెలుగులు నింపేలా సెల్‌ఫోన్‌లో లైట్లు వేయాలి' అని చెప్పారు. ఈ సభలో అంతకుముందు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏపీకి వచ్చేముందు 'ఎక్స్‌'లో ప్రధాని ఆసక్తికర ట్వీట్‌ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter