Pawan Kalyan: మనతోపాటు వన్య ప్రాణులకు బతుకినివ్వాలి.. డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
Pawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.
AP Forest Dept: మనతోపాటు జీవించే వన్యప్రాణులకు బతుకునివ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వన్యప్రాణులను వేటాడడం... చంపడం.. అక్రమ రవాణా చేయడం వంటివి చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అటవీ సంపదను నాశనం చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మనతో సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లపై జాలి చూపించాలని విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ అటవీ శాఖ కొత్త కార్యక్రమం తీసుకొచ్చింది.
Also Read: APSRTC Driver: నారా లోకేశ్ చొరవతో ఏపీఎస్‌ఆర్టీసీ రీల్స్ డ్రైవర్ విధుల్లోకి..
అమరావతిలోని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సోమవారం అటవీ శాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్‌ను డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విడుదల చేశారు. వన్య ప్రాణుల వేట, అక్రమ రవాణా సమాచారం కోసం యాంటీ పోచింగ్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 18004255909ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. భూమి మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశుపక్ష్యాదుల పట్ల కరుణ చూపాలని కోరారు.
వన్య ప్రాణులు, అటవీ సంపదకు మనలాగే బతికే హక్కు ఉంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం వన్య ప్రాణులను వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం నిషేధమని తెలిపారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడటం, అటవీ సంపదన నాశనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, చంపినా, అక్రమ రవాణాకు పాల్పడినా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అటవీ సంపదను నాశనం చేసినా.. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.