Viral Video: ఇదేక్కడి న్యాయం..?.. కండక్టర్ డ్యాన్స్‌కు మంత్రి ఫిదా.. ఉద్యోగం ఊడగొట్టిన ఏపీఎస్ఆర్టీసీ..స్టోరీ ఏంటంటే..?

rtc conductor dance on devara song: ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీలో ఇటీవల ఒక కండక్టర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేష్ సైతం స్పందించారు. కండక్టర్ డ్యాన్స్ కు ఫిదా అయినట్లు తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Oct 27, 2024, 07:22 PM IST
  • డ్యాన్స్ చేసిన కండక్టర్ కు బిగ్ షాక్..
  • విధుల్లో నుంచి తొలగించిన ఏపీఎస్ఆర్టీసీ..
Viral Video: ఇదేక్కడి న్యాయం..?.. కండక్టర్ డ్యాన్స్‌కు మంత్రి ఫిదా.. ఉద్యోగం ఊడగొట్టిన  ఏపీఎస్ఆర్టీసీ..స్టోరీ ఏంటంటే..?

Rtc conductor dance on devara song in Kakinada: ప్రతిఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. అది కొన్నిసార్లు అనుకొకుండా బైటకు వస్తుంది. కొంత మంది మనలో ఉన్న టాలెంట్ ను గుర్తించి , ఎంకరేజ్ చేస్తే బైటపడతారు. మరికొందరు తమకు తాముగా.. తమకున్న ప్రతిభను అందరి ముందు చూపిస్తుంటారు.  అయితే..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పుణ్యామా.. అని రీల్స్, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అది కాస్త నిముషాల్లోనే  వైరల్ గా మారిపోతున్నాయి.

Add Zee News as a Preferred Source

 

దీంతో కొంత మంది ఓవర్ నైట్ లో ఎక్కడలేని విధంగా ఫెమస్ అయిపోతున్నారు. తమ టాలెంట్ ను చాలా మంది ఫెస్ బుక్, ఇన్ స్టాలలో , రీల్స్ చేసి మరీ అప్ లోడ్ చేస్తున్నారు. దీనికి వచ్చే కామెంట్స్ , లైక్ లను చూసి పొంగి పోతున్నారు. కొన్నిసార్లు ఈ ఓవన్ నైట్ లో ఫెమస్ అయిపొవడం అనేది లేని ఇబ్బందుల్ని సైతం తెచ్చిపెడుతుందని చెప్పుకొవచ్చు. తాజాగా. ఒక కండక్టర్ చేసిన పని ప్రస్తుతం అతని మెడకే చుట్టుకుంది. 

పూర్తి వివరాలు..

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కాకి నాడలోని తుని డిపోకు చెందిన బస్ డ్రైవర్ ఒక్కసారిగా ఫెమస్ అయిపోయాడు. లోవరాజు అనే కండక్టర్ ఏపీ ఆర్టీసీలో గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతను.. బస్సులో ఉండగా.. కొంత మంది అతని టాలెంట్ తెలుసుకుని డ్యాన్స్ చేయాలని ఎంకరేజ్ చేశారు. దీంతో లోవరాజు గాల్లో తెలిపోయాడు. తన టాలెంట్ అందరికి తెలిసేలా ఏదో స్పెషల్ గా చేయాలనుకున్నాడు.డ్యూటీలో ఉన్న కూడా.. బస్ ను నిలిపివేసి, బస్సు ముందుకు వచ్చి దేవర పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు.

అక్కడున్న వారు కండక్టర్ మాస్ స్టెప్పులకు తెగ ఫిదా అయిపోయారు. వావ్.. అంటూ చప్పట్లు, విజిల్స్ లతో అతడ్ని మరింత ఎంకరేజ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పొస్ట్ చేశారు. అది వెంటనే వైరల్ గా మారింది.అది కాస్త మంత్రి నారాలోకేష్ వరకు వెళ్లింది. కానీ ఆయన కండక్టర్ ప్రతిభ బాగుందని మెచ్చుకున్నారు. దీంతో కండక్టర్ పొంగిపోయాడు. కానీ ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు మాత్రం షాక్ ఇచ్చినట్లు తెలుస్తొంది.

Read more: Viral Video: తేనెటీగ డ్రెస్సులో గున్న ఏనుగు రచ్చ.. అమ్మతో బుడిబుడి అడుగులు వేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తోన్న వీడియో..!

డ్యూటీ టైమ్ లో బస్సును వదిలేసి.. డ్యాన్స్ లు ఏంటని అతడ్ని జాబ్ లో నుంచి తొలగించినట్లు సమాచారం. దీంతో కండక్టర్ మాత్రం.. ఇదేం ట్విస్ట్ కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యాడంట.  ప్రస్తుతం ఈ ఘటన కాస్త వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News