అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదముద్ర వేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) స్పందించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సమయం కాదని.. ముందు ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వం బాధ్యత ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్, చత్తీస్‌గడ్ రాజధాని రాయఘడ్‌ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారని గుర్తుచేసిన పవన్ కల్యాణ్.. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు కావాల్సిందేనని జగన్ శాసనసభలో గట్టిగా పట్టుబట్టారని.. కానీ అంత భూసేకరణ అవసరం లేదని చెప్పింది మాత్రం ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: 3 capitals of AP: 3 రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ ఆమోదం..చంద్రబాబు భావోద్వేగం


ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల ఇబ్బందులపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ విషయంలో రైతుల తరపున పోరాటానికి జనసేన ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. Also read: BJP in AP: రాజధాని విషయంలో బీజేపి వైఖరి ఇదే