Pawan Kalyan Donation: సొంత పార్టీకి భారీ విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్.. `అంత డబ్బా` అని జన సైనికులు షాక్
Pawan Kalyan Elections: తాను స్థాపించిన జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో విరాళాలు సేకరిస్తుండగా ఒక నాయకుడిగా పార్టీకి పవన్ విరాళం అందించారు. ఈ సందర్భంగా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Elections: సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో టీడీపీతో కలిసి జనసేన ముందడగు వేస్తోంది. సీట్ల పంపకాలపై చర్చలు సాగిస్తూనే ఎన్నికలకు క్షేత్రస్థాయిలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై కూడా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీకి పవన్ భారీ విరాళం ప్రకటించారు. అక్షరాలా రూ.10 కోట్ల విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన
ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ సోమవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నాయకులతో సమావేశమయ్యారు. విరాళం ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలపై, రానున్న ఎన్నికల విషయమై స్పందించారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు.
Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?
పార్టీ శ్రేణులు విజయమే లక్ష్యంగా పని చేయాలని పవన్ సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పటిష్టంగా పని చేసి గెలుపు దిశగా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. వ్యక్తిగతంగా తన గెలుపు గురించి ఆలోచించడం లేదని, సమష్టిగా గెలుపు కోసమే తొలి నుంచి తన వ్యూహం, అడుగులు ఉన్నాయని వివరించారు. జనసేన కోసం తపించి పని చేసిన ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
పార్టీకి 2019 నుంచి బలంగా నిలిచేందుకు సహకరిస్తున్న నాయకులకు అండగా ఉంటామని పవన్‌కల్యాణ్ భరోసా ఇచ్చారు. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తర్వాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగినట్లు గుర్తు చేశారు. జనసేన కోసం పని చేస్తున్న వారెవరినీ విస్మరించేది లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికలే కాదని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలు కూడా దృష్టిలో ఉంచుకొని పని చేయాలని సూచించారు.
ఇప్పుడు కష్టపడి పని చేస్తే వచ్చే ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలు, పీఏసీఎస్, ఇతర కీలక నామినేటెడ్ పదవులు లభిస్తాయని పార్టీ శ్రేణులకు పవన్ ఆశచూపే ప్రయత్నం చేశారు. మూడింట ఒక వంతు పదువులు దక్కించుకుందామని లక్ష్యం నిర్దేశించారు. ఏపీకి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు వలన ఆగ్రహంగా ఉన్న పార్టీ శ్రేణులను పవన్ చల్లార్చే ప్రయత్నం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook