Vakeel Saab shooting: ఆదివాసీలతో జనసేనానీ.. పవన్ కల్యాణ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ అవుతున్న వకీల్‌సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Pawan Kalyan enjoys Adivasis Tribal song | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ అవుతున్న వకీల్‌సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉంది. ప్రస్తుతం వకిల్‌సాబ్ షూటింగ్ ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లోని విశాఖ ఏజెన్సీలోని అరకు ప్రాంతంలో జరుగుతోంది. అయితే షూటింగ్ విరామ సమయంలో పవన్ కల్యాణ్ ఆదివాసీలతో ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు పాడిన పాటలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఆదివాసీలు పాడుతున్న పాట వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఈ విధంగా రాశారు. ‘‘నిన్న వకీల్ సాబ్ షూటింగ్ విరామంలో అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియాలో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట.. వింటుంటే బిభూతి భూషణ్ బందోపాధ్యాయ రచించిన 'వనవాసి' గుర్తుకువచ్చింది’’ అంటూ ట్వీట్ చేశారు. Also Read: Pawan Kalyan-Rana: అదిరిపోయే కాంబినేషన్.. పవన్ మూవీలో రానా
వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ ( Shruti Haasan ) అంజలి, నివేథా థామస్, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Also read: Shruti Haasan: శృతి హాసన్.. గ్లామరస్ ఫొటోలు వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook