Pawan kalyan Hoisted Flag Wearing FootWear: దేశవ్యాప్తంగా ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారతదేశం గణతంత్ర దినోత్సవంగా మారి 74 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1950 జనవరి 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను క్రమం తప్పకుండా అత్యంత ఘనంగా జరుపుతూ వస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వేడుకలని అత్యంత ఘనంగా జరుపుతూ ఉంటాయి. ఢిల్లీ వేదికగా త్రివిధ దళాల కవాతు కూడా కన్నుల పండువలా జరుగుతుంది. ఇక రాష్ట్రాలవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న ముఖ్య రాజకీయ పార్టీల నేతలు కూడా జెండా వందనం చేసి దేశభక్తిని చాటుకుంటూ ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ లో ఉన్నారు.


పార్టీ ఆఫీస్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన పాల్గొనగా ఆ పాల్గొన్న సమయంలో చెప్పులు వేసుకుని జెండా ఆవిష్కరించారు. ఇక ఈ విషయం మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో జనసేన ను విపరీతంగా టార్గెట్ చేస్తున్న వైసీపీ మద్దతుదారులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షు స్థాయిలో ఉండి మీరు ఇలా చేయడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన పక్కన ఉన్న జనసేన పార్టీలో కీలక నేత నాదెండ్ల మనోహర్ సైతం చెప్పులు ధరించే అక్కడ నిలబడ్డారు.


అయితే వైసీపీ అభిమానులు పవన్ ని టార్గెట్ చేస్తూ ఇలా కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం జాతీయ జెండాకి గౌరవం ఇస్తామని, అయితే చెప్పులు ధరించి చేయడం వల్ల జాతీయ జెండాను అవమానపరిచినట్లు కాదని చెబుతున్నారు. కొందరు వ్యక్తులు గౌరవ సూచికంగా చెప్పులు లేదా షూస్ పక్కన పెట్టి జాతీయ జెండాకు వందనం చేస్తారు కానీ కవాతు చేసే సైనికులు షూస్ వేసుకునే చేస్తారు కదా, వారు అలానే జెండాకు వందనం చేస్తారు కదా అని  అంటూ తమ వాదన వినిపిస్తున్నారు. అయితే వాస్తవానికి చెప్పులు లేదా షూస్ ధరించి జాతీయ జెండాని ఆవిష్కరించడం వందనం చేయడం తప్పేమీ కాదు అంటున్నారు.  ఎందుకంటే షూస్ ధరించడం వల్ల జాతీయ జెండాని అవమానించినట్లు కాదని అంటున్నారు.


Also Read: Mike Tyson Rape: 90స్ లో రేప్ చేశాడు..మైక్ టైసన్ నుంచి 40 కోట్లు ఇప్పించమంటున్న మహిళ


Also Read: Veera Simha Reddy 2 Weeks: దారుణంగా పడిపోయిన వీరసింహారెడ్డి వసూళ్లు.. మొత్తంగా లాభం ఎంతంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook