Pawan Kalyan: కేంద్రం ఆదేశిస్తే.. పవన్ కళ్యాణ్ పాటిస్తాడు. అవును కేంద్రంలోని ప్రధాని, హోంమంత్రులైన నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఆదేశాలతో పాటు వారి మనసెరిగి ప్రవర్తిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం కమ్ జనసేనాని పవన్ కళ్యాణ్. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన టాస్క్ లను కూడా పూర్తి చేస్తూ వారిద్దిరికి మరింత చేరువ అయ్యారు. అంతేకాదు తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కేంద్ర పెద్దల ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. అది పూర్తిగా వర్కౌట్ అయింది. అంతేకాదు  పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఎక్కువ మెజారిటీతో గెలిచారు. దీంతో కేంద్ర పెద్దలు జనసేనానిపై ప్రశంసల వర్షం కురిస్తున్నారు.
 
మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం తర్వాత గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు పవన్ కు సామాజిక మాధ్యమాల వేదికగా  థ్యాంక్స్ చెప్పారు. ఇదే సమయంలో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పవన్ ను ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కల్యాణ్ ఓ క్రౌడ్ పుల్లర్ అంటూ ఆకాశానికెత్తాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహారాష్ట్రలో పవన్‌ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో ‘మహాయుతి’ అభ్యర్థులు గెలిచారని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్‌షాను లోక్‌సభలో జనసేన లోక్ పక్ష నాయకుడు బాలశౌరి మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలిశారు. మహారాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆదరణతో తమ గెలుపులో పవన్‌కల్యాణ్‌కు భాగస్వామ్యమయ్యారని ప్రశంసించారు. మరోవైపు త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికలతో పాటు బిహార్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోవాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేశారు. ఇక సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో జనసేనాని.. ప్యాన్ ఇండియా పొలిటిషన్ అయ్యారు. హీరోగా కంటే రాజకీయ నాయకుడిగా ప్యాన్ ఇండియా లెవల్లో  క్రేజ్ సంపాదించుకున్నాడు.


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.