Pawan Kalyan: యాగం చేపట్టిన పవన్ కళ్యాణ్.. పట్టు వస్త్ర ధారణలో జనసేనాని
Pawan Kalyan Participates in Yagam: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ యాగం చేపట్టారు. సోమవారం ఉదయం మొదలైన ఈ యాగం మంగళవారం కూడా కొనసాగనుంది. పవన్ కళ్యాణ్ పట్టు వస్త్ర ధారణలో పాల్గొన్నారు.
Pawan Kalyan Participates in Yagam: ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యాగం చేపట్టారు. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం 6 గంటల 55 నిమిషాలకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు ధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. ప్రత్యేకంగా వేసిన గుడిసె పాకలలో జనసేనాని యాగం నిర్వహించారు.
యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపించారు. స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీ మాత, అప్టైశ్వర్య ప్రసాదాధిపతులు శివపార్వతులు, ఆయురారోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత.. త్రిస్టితియుక్త కారకుడు మహావిష్ణువు ఈ యాగపీఠంపై పరివేష్టితులై ఉన్నారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన చేపట్టారు. విగ్రహం.. యంత్రం.. హోమం ఆలంబనగా ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఈ యాగం రేపు కూడా కొనసాగుతుంది.
"మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూలహారాలు, అరటిచెట్లు, రంగవల్లుల అలంకరణతో యాగశాల శోభాయమానంగా అలరారుతోంది. ఈ యాగం చేపట్టేందుకు ఆదివారం సాయంత్రానికే పవన్ కళ్యాణ్ గారు యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా నిర్వర్తిస్తున్న ఈ యాగం ధార్మిక చింతన కలిగిస్తోంది.." అని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు.
Also Read: World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..?
Also Read: Jagananna Vidya Kanuka: నేడే జగనన్న విద్యాకానుక పంపిణీ.. ఒక్కో విద్యార్థికి రూ.2,400 ఖర్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి