CM Jagan Tour in Palnadu: ఏపీలో వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,042.53 కోట్ల ఖర్చు చేస్తోంది. సోమవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్‌లు, వర్క్ బుక్‌లు, 3 జతల యూనిఫామ్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్ అందజేయనున్నారు.
బడులు తెరిచిన తొలిరోజే అందజేత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుండడం విశేషం. జగనన్న విద్యాకానుక కిట్‌కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ)తో సహా 4 దశల్లో నాణ్యతా పరీక్షలు జరిగాయి. ప్రతి విద్యార్థికీ దాదాపు 2,400 రూపాయల విలువైన జగనన్న విద్యా కానుక అందనుంది. పాఠశాలలు తెరిచిన రోజే మొత్తం 10 వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులు అందుకోనున్నారు.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది ఏపీ సర్కారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతోంది. రాబోయే రోజుల్లో ప్రతి బడి ఇంగ్లీషు మీడియంతో సీబీఎస్ఈ సిలబస్ తీసుకొస్తోంది. డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు బోధించే దిశగా తొలిదశ "మనబడి నాడు నేడు"లో అభివృద్ధి పరిచిన 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 30 వేల పైచిలుకు క్లాస్ రూములలో బైజూస్ కంటెంట్‌తో కూడిన ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇంగ్లీష్ ట్యాబ్స్ ఏర్పాటు చేసి 1-5 వరకు ప్రతి స్కూల్లో ఉండేలా 10 వేల స్మార్ట్ టీవీలు కూడా ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.
మొదటి దశ మనబడి నాడు నేడులో పనులు పూర్తి అయిన 15,715 స్కూళ్లలో ఈ ఏడాది జులై 12 నాటికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు కానుందని అధికారులు తెలిపారు. రెండవ దశలో భాగంగా 22,344 స్కూళ్లలో ఈ ఏడాది డిసెంబర్ 21 నాటికి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటు పూర్తి అవుతుందని అన్నారు. 8వ తరగతి విద్యార్ధులకు బైజాన్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాట్‌లు.. 4 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా బైజూస్ కంటెంట్.. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్.. బీఎస్ఎన్ఎల్, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 45,000 పాఠశాలల్లో ఇంటర్ నెట్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
Also Read: Novak Djokovic: గర్జించిన సెర్బియా సింహం.. జకోవిచ్ దెబ్బకు తలవంచిన రికార్డులు
Also Read: Ind VS Aus WTC Final 2023: మ్యాచ్ మధ్యలో అమ్మాయికి లిప్ కిస్.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి