Pawan Kalyan Vizag Tour:  విశాఖపట్నంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నగరాన్ని విడిచివెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా... జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. నోవాటెల్ హోటల్ లోనే బస చేశారు. పవన్ కు మద్దతుగా జనసేన కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో విశాఖలో ఉద్రిక్తత పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఇక విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి కేసులో అరెస్టైన జనసేన కార్యకర్తలకు జిల్లా కోర్టులో ఊరట లభించింది. పోలీసులు అరెస్ట్ చేసిన మొత్తం 71 మంది జనసేన కార్యకర్తలను ఆదివారం అర్ధరాత్రి తర్వాత  జిల్లా కోర్టు జడ్జి ముందుప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు.. 61 మంది జనసేన నాయకులకు రూ.10వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. మరో 9 మంది నేతలకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన 9 మంది నేతలను జైలుకు తరలించారు పోలీసులు. బెయిల్ లభించిన జనసేన నేతలు తెల్లవారుజామున 3 గంటలకు బయటికి వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విడుదలైన జనసేన కార్యకర్తలు పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆనందపురం పోలీస్ స్టేషన్ లో తమను బెల్టులతో కొట్టారని  చెప్పారు.. రిమాండ్ విధించిన 9 మందిని విడుదల చేయించేందుకు జనసేన లీగల్ సెల్ ప్రయత్నాలు చేస్తోంది. కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. దీనిపై సోమవారం విచారణ జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన నాయకులంతా రిలీజ్ అయ్యేవరకు విశాఖలోనే ఉండాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.  నోవాటెల్ హోటల్‌లోనే పవన్ నాగబాబు, నాదెండ్ల మనోహర్ బస చేశారు. అరెస్ట్ అయిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉండాలని పవన్ నిర్ణయించారు. దీంతో విశాఖ నగరంలో హైటెన్షన్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ బసచేస్తున్న నోవాటెల్ హోటల్ పోలీసుల ఆధీనంలో ఉంది. హోటల్ వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. హోటల్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.


మరోవైపు ఆదివారం రోజంతా జనసేన కార్యకర్యలు, పవన్ కల్యాణ్ అభిమానులు నోవాటెల్ దగ్గరే ఉన్నారు. తమ నేత మద్దతుగా అక్కడే పడిగాపులు కాశారు. అర్థరాత్రి వరకు పవన్ ఫ్యాన్స్ అక్కడే ఉన్నారు. సోమవారం కూడా పవన్ విశాఖలోనే ఉండనుండటంతో హై టెన్షన్ నెలకొంది. పవన్ తో పోలీసు అధికారులు చర్చలు జరుపుతున్నా కొలిక్కి రావడం లేదు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook