తెలంగాణ ఇంటర్ మార్కుల అవకతవకలపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యార్థుల భవిష్యత్తుతో  తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కుల అవకతవకలపై న్యాయ విచారణకు ఆదేశించాలని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు


పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ ..ఇలా అనేక అంశాల్లో విద్యార్ధులు... తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉన్నాయన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన అధికారులు ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్ధుల జీవితాలలతో ఆడుకుంటే ఖబర్దార్ అంటూ ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హెచ్చరించారు.