కర్ణాటక రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసి మరీ అధికారం జులుం ప్రదర్శించిందని.. అదే పంథాను ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ కూడా అవలంబిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ ఏపీ విభజనకు సంబంధించిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని.. అందుకే ప్రజలు మేల్కొని ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో మే 20వ తేది నుండి 45 రోజుల పాటు జనసేన పోరాట యాత్ర చేస్తుందని.. అది ఉత్తరాంధ్ర నుండే ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.


శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుండి ఉత్తరాంధ్ర పోరాట యాత్ర ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ యాత్రలోనే జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పిస్తామని కూడా తెలిపారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఆ యాత్ర సాగుతుందని.. 2019 ఎన్నికల లక్ష్యంగా జనసేన సిద్ధమవుతుందని..రాష్ట్రంలో కచ్చితంగా త్రిముఖ పోటీ ఉంటుందని ఆయన తెలిపారు.