Pawan Kalyan To YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా మార్చాలి అని ఆ రెండు జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. అందుకోసం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బలమైన వ్యూహం ఉండాలి. దానికి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పూర్తిస్థాయి ప్రణాళికతో సంసిద్ధమవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, " డబ్బు, పేరు కాదు.. జనసేన పార్టీ శ్రేణులను బలమైన ఆలోచనా విధానం కలిపింది. మొదటి నుంచి ఓ నిర్దిష్టమైన విధానంలో నేను బతకాలని అనుకున్నాను. క్రమశిక్షణతో పాటు సమాజాన్ని చదువుతూ ముందుకెళ్లగలిగాను. నిత్యం నా మనసు బరువుగా ఉంటుంది. ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పే వేలకొద్ది వేదనలు వింటూ, రాత్రి వేళ వారి గురించి ఆలోచిస్తూ బరువెక్కిన గుండెతో నిద్రపోతాను. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవు... ప్రజల వేదనలు, వారి కన్నీటి గాథలే నన్ను మరింత రాటు దేల్చాయి. ఘోరమైన ఓటమి తర్వాత కూడా నేను నిలబడి ఉన్నానంటే వారికి ఏదైనా మేలు చేయాలన్న బలమైన సంకల్పమే ముందుకు నడిపిస్తోంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. 


నాకు డబ్బు వ్యామోహం లేదు. డబ్బు మనిషిగా మారితే పోరాట బలం పోతుందని బలంగా నమ్మేవాడిని. పీడితుల కోసం బలమైన భావజాలం ఉండాలని, అది నిర్దిష్టంగా ఉండాలని నమ్మే వ్యక్తిని. పార్టీ కోసం నిత్యం వేలాది మంది పనిచేస్తున్నారు. జనసేన పార్టీకి కోట్లాది మంది మద్దతు ఉంది. అందరినీ నేను కలవకపోవచ్చు. మీరు మాత్రం నా ప్రతినిధులుగా వారిని కలవండి. ప్రజల కష్టాలను వినే నాయకుడే భవిష్యత్తులో బలంగా మారతాడు. నన్ను చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయి నుంచి, మిమ్మిల్ని చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయికి ప్రజలను తీసుకురావాలి. వారి కష్టాల్లో, కన్నీళ్లలో జనసేన ప్రతినిధులుగా మీరు తోడుగా ఉండాలి అని జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు. 


ఇది కూడా చదవండి : Pawan Kalyan About Life Threat: నాకు ప్రాణహాని ఉంది.. సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారు


త్యాగాలతో కూడిన బాధ్యతే నాయకత్వం
నాకు చేగువేరా స్ఫూర్తి అని పదేపదే ఎందుకు చెబుతాను అంటే  తన ప్రాంతం.. తన మనుషులు కాని వారి కోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యాడు. నాయకత్వం అంటే త్యాగాలతో నిండిన బాధ్యతగా నేను భావిస్తాను. కేవలం హడావుడి చేస్తే నాయకులు కాలేరు. నాతో రెండుసార్లు ఫొటోలు దిగితే నాయకత్వం రాదు. ప్రజల్లో ఉండి, వారి కోసం బలంగా పనిచేసి, పార్టీ భావజాలాన్ని విస్తరిస్తారో కచ్చితంగా మీకు గుర్తింపు లభిస్తుంది. సాధారణ ప్రజల బాధలు, వారి సమస్యలు చాలా దగ్గరగా వినాలని నాకు మనసులో బలంగా ఉంటుంది. అయితే అభిమానుల తాకిడి దాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. నేను సినిమా నటుడికి కాకపోయి ఉంటే బలమైన రాజకీయ నాయకుడిని అయ్యేవాడిని. జనసేన పార్టీని తపనతో నడుపుతున్నాను. దీనివెనుక బలమైన భావజాలం, సిద్ధాంతం ఉన్నాయి. నన్ను యువత నమ్ముతున్నారంటే అది కేవలం భావజాలం కలిపిన ఓ సున్నితమైన బంధం. దాన్ని మీరు కొనసాగించాలి. యువత నమ్మితే సిద్ధాంతం కోసం ప్రాణాలివ్వడానికి అయినా సిద్ధంగా ఉంటారు. ఏ గొప్ప నాయకుడి చరిత్ర చూసినా ఎన్నో త్యాగాలతో మిళితం అయి ఉంటాయి అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.


ఇది కూడా చదవండి : Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్


ఇది కూడా చదవండి : Pawan Kalyan: ఈ సారి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK