ప్రభుత్వ సెక్యూరిటీని వెనక్కి పంపిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనకు ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని వెనక్కి పంపారు
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనకు ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని వెనక్కి పంపారు. తనకు కేటాయించిన 2 ప్లస్ 2 గన్‌మెన్లను పవన్ కళ్యాణ్ వెనక్కి పంపారు. ప్రభుత్వ సెక్యూరిటీని తనపై నిఘాకు వాడుకుంటుందని పవన్ అనుమానిస్తున్నారు. పార్టీ అంతర్గత విషయాలు లీక్ అవుతున్నాయని భావిస్తున్న పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల గుంటూరు బహిరంగ సభ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డీజీపీకి లేఖ రాశారు. తనకు బహిరంగ సభ అనంతరం కూడా భద్రత కావాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఆయన కోరికను మన్నించింది. ఇటీవలే పార్టీ గుంటూరు సభ సమయంలో సెక్యూరిటీ కావాలని పవన్ డీజీపీని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గత నెల (మార్చి)లో ఆయనకు 2 ప్లస్ 2 భద్రతను కల్పించింది. మొత్తం నలుగురు సెక్యూరిటీ సిబ్బంది.. రెండు షిఫ్టుల్లో ఉంటారు. ఒక్కో షిఫ్టులో ఇద్దరి రక్షణగా ఉంటారు.