Akhil Akkineni: అఖిల్‌ పెళ్లిపై నాగార్జున సంచలన ప్రకటన.. వధువు ఎవరో తెలుసా?

Akkineni Akhil Engagement With Zainab Ravdjee: సినీ పరిశ్రమలో మరో యువ నటుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. అక్కినేని కుటుంబంలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న అఖిల్‌ పెళ్లి కబురును అతడి తండ్రి కింగ్‌ నాగార్జున ప్రకటించాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 26, 2024, 05:48 PM IST
Akhil Akkineni: అఖిల్‌ పెళ్లిపై నాగార్జున సంచలన ప్రకటన.. వధువు ఎవరో తెలుసా?

  Akkineni Akhil Engagement: అక్కినేని ఇంట మరో పెళ్లి బాజా మోగనుంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ వివాహం జరుగుతున్న సమయంలోనే తన రెండో కుమారుడి పెళ్లిపై నాగార్జున సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయే కోడలి పేరును ప్రకటించారు. త్వరలోనే వారి పెళ్లి చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. తన కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం చేసుకున్నట్లు నాగార్జున ప్రకటించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇది చదవండి: Kulasekhar Lyricist: సినీ ఇండస్ట్రీలో పాటల రచయత దుస్థితి కారణం అదేనా అంతేనా..

తన కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం చేసుకున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ సందర్భంగా నిశ్చితార్థం చేసుకున్న అఖిల్‌ తన కోడలి ఫొటోను పంచుకున్నారు. 'అక్కినేని అఖిల్‌, జైనాబ్ రావ్‌డ్జీ నిశ్చితార్థం చేసుకున్నారని చెప్పేందుకు మేం చాలా సంతోషిస్తున్నాం. జైనబ్‌ను మా కుటుంబంలోకి సంతోషంగా స్వాగతం పలుకుతున్నాం. వారిద్దరూ జీవితాంతం ప్రేమ, ఆనందంతో కలిసి జీవించాలని కోరుతూ మీరందరూ శుభాశీస్సులు అందించాలని కోరుతున్నా' అని నాగార్జున 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

ఇది చదవండి: Kissik Song: ఏపీ రాజకీయాల్లో పుష్ప 2 'కిస్సిక్' పాట రచ్చ.. వారికి అల్లు అర్జున్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌?

ఇక తనకు కాబోయే భార్యపై అఖిల్‌ కూడా స్పందించాడు. 'నా జీవిత భాగస్వామిని కనుగొన్నా. జైనబ్‌ రావ్‌డ్జీతో నిశ్చితార్థం చేసుకున్నాని చెప్పేందుకు సంతోషిస్తున్నా' అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అఖిల్‌ స్పందించాడు. ఈ సందర్భంగా అఖిల్‌ మూడు ఫొటోలు పంచుకున్నాడు. తెల్లటి దుస్తులు ధరించిన అఖిల్‌, జైనబ్‌ అందంగా కనిపించారు. జైనబ్‌తో కొన్నాళ్లు అఖిల్‌ ప్రేమలో ఉన్నట్టు.. డేటింగ్‌ కూడా చేశాడని ప్రచారం జరుగుతోంది. 

గతంలోనే నిశ్చితార్థం
కాగా అక్కినేని అఖిల్‌కు గతంలోనే నిశ్చితార్థం జరిగి వివాహం వరకు ఆ బంధం కొనసాగలేదు. శ్రియా భూపాల్‌తో అఖిల్‌ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా వారి బంధం పెళ్లి వరకు రాలేదు. డిసెంబర్‌ 4వ తేదీన అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం జరుగుతున్న సమయంలో అఖిల్‌ నిశ్చితార్థం జరగడం విశేషం. అక్కినేని కుటుంబంలో ఒకేసారి రెండు శుభకార్యాలు జరుగుతుండడంతో అక్కినేని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x