Pawan Kalyan Fever: తిరుమల లడ్డూ వ్యవహారంలో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా జనసేనాని.. కమ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అలిపిరి కాలినడక మార్గాన తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడ్డారు. వెన్నునొప్పి కారణంగా పవన్ కళ్యాణ్ కు జ్వరం వచ్చిందని చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా డాక్టర్లు తిరుమల అతిథి గృహంలోనే చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం తిరుపతిలో వారాహి సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. జ్వరంతో ఉన్న పవన్ కళ్యాణ్ వారాహి సభకు హాజరు కానున్నరని జనసేన వర్గాలు చెబుతున్నాయి.


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వారాహి డిక్లరేషన్ పై కీలక ప్రసంగం చేయనున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటుపై ఏదైనా ప్రకటన చేస్తారా అనేది చూడాలి. మొత్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి కీలక ప్రకటన చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ సభకు ఏపీలో పలు హిందూ దేవాలయలకు సంబంధించిన సాధు సంతులతో పాటు ఆగమ పండితులతో పాటు హిందూ ధర్మం కోసం పోరాడుతున్న పలువురు ప్రముఖులతో పాటు వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కీలక నేతలు కూడా హాజరు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


మొత్తంగా ఈ వేదికగా గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయలతో పాటు హిందూ ధర్మంపై జరిగిన దాడులను ప్రజా క్షేత్రంలో ఎండగట్టనున్నారు. మరోవైపు జగన్ ... డిక్లరేషన్ ఇవ్వకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఇప్పటికే క్రిష్టియన్ అయిన తన చిన్న కూతురు  తిరుమల డిక్లరేషన్ పై సంతకం పెట్టి జగన్ ను రాజకీయంగా చావు దెబ్బ తీసాడు పవన్ కళ్యాణ్. మరి తిరుపతి వేదికగా జగన్ కు రాజకీయ సమాధికి పునాది కడతాడా అనేది చూడాలి.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.