పవన్ కళ్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్‌లోని జనసేన కార్యకర్తలతో ఖమ్మం ఎమ్బీ గార్డెన్స్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పలు అంశాలపై ప్రసంగించారు కూడా.. ఆ ప్రసంగంలోని పవన్ గళం నుండి వచ్చిన కొన్ని ఆసక్తికరమైన మాటలు మీకోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*సమాజంలో మార్పు కోసం ఆఖరి శ్వాస వరకూ పోరాడతాను. కొందరు నన్ను విమర్శిస్తున్నారు. మీరు మీ విమర్శలు చేస్తూనే ఉండండి. నా పై దాడులు చేసినా నేను స్వీకరిస్తాను


*నాది ఓటు బ్యాంకు రాజకీయం కాదు..మానవత్వంతో కూడిన రాజకీయం


*నాకు కులం, మతం లేదు.  మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉంది. కులవ్యవస్థను కాదని రాజకీయాలను చేయలేము.


*ప్రేమించేవాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను


*ప్రపంచ తెలుగుమహాసభల సందర్భంగా ఆంధ్రవారిని పిలవలేదని బాధ కలిగింది. తెలంగాణ కవులు, కళాకారుల ఉనికిని గట్టిగా చాటాలనే ఆంధ్రా కవులను తెలుగు మహాసభలకు పిలవలేదనుకుంటాను


*తెలంగాణ ఉద్యమం నేర్పుగా, ఓర్పుగా జరిగింది. అందుకే తెలంగాణపై ఎలా మాట్లాడాలో బేరీజు వేసుకుంటున్నాను. కానీ భయపడడం లేదు


*రాజకీయాలంటే తిట్టుకోవడం, నీచమైన భాష వాడటం కాదు. రాజ‌కీయం అంటే ప్రత్యర్థులను విమ‌ర్శించ‌డం మాత్రమే కాదు. ప్రజలకు మేలు చేయాలని అనుకోవడం


*అధికార కాంక్ష వేరు.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లడం వేరు. అసలు అధికార కాంక్ష, అధికార దాహం.. ఇలాంటి పదాలు వాడటమే నాకు ఇష్టం లేదు


*అసలు చంద్రబాబుకు, కేసీఆర్‌లకే పడదు. అలాంటి వారికి నేను ఏజెంట్ ఎలా అవుతాను. 


*కాంగ్రెస్ పార్టీ గనుక వీ హనుమంతరావును తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. నేను ఆయనకు మద్దతును ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి పోరాడతాను.