మీ చట్టాలను మేం ఎందుకు పాటించాలని కేంద్రానికి పవన్ ప్రశ్న
ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించారు.
జనసేన ఆవిర్భాభ సభలో పవన్ కల్యాణ్ ఉద్వేగ భరింతగా ప్రసంగించారు. ముందుగా హోదా విషయంలో అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ఆయనకు అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ లో స్పందించారు. ఈ సందర్భంలో పవన్ కేంద్రంపై పశ్నల వర్షం కురిపించారు. విభజన సమయంలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా అవసరమని చెప్పారు..కానీ ఇప్పుడెందుకు మాట మార్చారు. 2014 ఎన్నికల సమయంలో ఎన్నోహామీలు ఇచ్చారు. విభజన హామీలన్ని నెరవేర్చుతామని మాట ఇచ్చారు. అమరావతిని ఢిల్లీ కంటే గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాకా ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదు. మీరు చేసిన చట్టాలను మీరే గౌరవించపోతే..వాటిని మేం ఎందుకు పాటించాలని పవన్ కేంద్రానికి ప్రశ్నించారు.
జైట్లీ ఎందుకు నీకు అంత అహంకారం
ప్రత్యేక హోదా విషయంలో కూడా జైట్లీ చులకనగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా అడిగితే సెంటిమెంట్ ఆధారంగా హోదా ఇవ్వాలేమంటున్నారు. సెంటింమెంట్ ఆధారంగానే తెలంగాణ ఇచ్చారు కదా.. మాకు ఇచ్చిన హామీలు మాత్రమే అమలు చేయమని కోరుతున్నాం. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఎంతకైనా పోరాడతామని పవన్ కల్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు