అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్ సభ ఎన్నికలకు సైతం సరిగ్గా మరో నెల రోజులే మిగిలి వున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ 115 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేయగా ఒకటి, రెండు రోజుల్లో మరో 14 మంది అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఇదిలావుంటే తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. 32 అసెంబ్లీ స్థానాలకు, 9 పార్లమెంట్ స్థానాలకుగాను పార్టీ పలువురు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు పవన్ కల్యాణ్ ట్విటర్ ద్వారా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177469","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అమలాపురం లోక్ సభ స్థానం నుంచి డీఎంఆర్ శేఖర్, రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి డా ఆకుల సత్యనారాయణ పోటీచేస్తారని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.


[[{"fid":"177470","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ మొదలుపెట్టడంతో ఆ పార్టీ నుంచి టికెట్స్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో వారిలోనూ తమకు టికెట్ దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ ప్రారంభమైంది.