AP govt on Pegasus spyware: భూమన కరుణాకర్ రెడ్డి చైర్మెన్‌గా పెగాసస్ హౌజ్ కమిటి
Pegasus spyware allegations on Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన సంచలన ఆరోపణలు ఏపీ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే.
Pegasus spyware allegations on Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో పెగాసస్ రచ్చ మరింతగా ముదిరింది. పెగాసస్ అంశంపై జగన్ సర్కార్ సీరియస్‌గా ముందుకు వెళుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ప్రయోగించిందన్న ఆరోపణలపై ఏపీ అసెంబ్లీ హౌజ్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇవాళ కమిటీని ప్రకటించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా స్పీకర్ తమ్మినేని హౌజ్ కమిటీ వేశారు. హౌజ్ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్‌నాథ్, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు. మద్దాల గిరిధర్ టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు నాయుడుపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలతో ఏపీ రాజకీయాల్లో రచ్చ మొదలైంది. పెగాసస్ అంశం ఏపీ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది.
తమపై చంద్రబాబు అక్రమంగా నిఘా పెట్టారని వైసీపీ తీవ్రంగా ఆరోపించింది. చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ ఉపయోగించారని వస్తోన్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో స్పైవేర్ ఉదంతంపై హౌజ్ కమిటీ ఏర్పాటు చేయాలని సోమవారమే ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం హౌజ్ కమిటీని ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. మరోవైపు టీడీపీ మాత్రం పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware) వినియోగం ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని ప్రకటించింది.
Also read: RRR Movie Leaked Online: RRR మూవీకి తప్పని పైరసీ బెడద.. ఆన్ లైన్ లో ఫుల్ HD ప్రింట్?
Also read : CI Kambagiri Ramudu: ఇదెక్కడి చోద్యం..? పోలీసును పట్టుకోటానికి పోలీసు బృందం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook