AP Assembly Session: కొత్తగా అమల్లోకి వచ్చిన మద్యం విధానంలో కొన్ని మార్పులు చేయాలని ఓ ఎమ్మెల్యే కోరడంతో అసెంబ్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది. మందుబాబుల బాధను అర్థం చేసుకున్న ఓ ఎమ్మెల్యే ఏకంగా శాసనసభలో చర్చ చేశారు. ఇంట్లో మద్యం నిల్వ చేసుకునే సీసాల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌ చేసిన తప్పిదాన్ని మీరు చేయకుండా మందుబాబు బాధ అర్థం చేసుకోవాలని కోరారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో నవ్వులు పూయగా.. ఇది నిజమైన సమస్య అంటూ మరికొందరు ఎమ్మెల్యేలు వత్తాసు పలకడం విశేషం. అసలు ఏం జరిగింది? ఏమిటి మందు గోల తెలుసుకోండి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Task Force: చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ భారీ షాక్‌.. వారి రక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌


 


చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్‌ ప్రభుత్వం చేపట్టిన విధానం అలాగే అమల్లోకి చేయడంతో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఇంట్లో కేవలం ఆరు మద్యం సీసాలు మాత్రమే నిల్వ చేసుకోవాలనే నిబంధన ఎత్తివేయాలి' అని ఆయన కోరారు. ఆ నిబంధనతో మందు పార్టీలు నిర్వహించుకునే వారు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ వాపోయారు.

Also Read: Chandrababu: మాజీ సీఎంగా జగన్‌ను.. మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టడం దేవుడు రాసిన స్క్రిప్ట్‌


 


'మద్యం పాలసీలో కొన్ని మార్పులు చేయండి. 6 మద్యం బాటిళ్ల కన్నా ఒక్క సీసా ఎక్కువ ఉన్నా జగన్‌ జైల్లో వేస్తాడని పెట్టుకోలేదు. మంచి మద్యం వేరే చోట తెచ్చి ఇంట్లో ఆరు బాటిళ్లు పెట్టుకుని మిగిలిన వాటిని స్నేహితుల ఇళ్లల్లో భద్రపరిచేవాళ్లం. అవేమో తమ మిత్రుడు గిఫ్ట్‌గా ఇచ్చాడని భావించి వాళ్లు తాగేవాళ్లు' అని విష్ణుకుమార్‌ రాజు వివరించగా ఒక్కసారిగా అసెంబ్లీలో నవ్వులు విరబూశాయి. ఇది చాలా పెద్ద సమస్య అని.. బిజినెస్‌ హౌస్‌లకైనా ఈ కోటా పెంచాలని ఎక్సైజ్‌, హోం శాఖ మంత్రులను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.


మద్యం విషయం అసెంబ్లీలో మాట్లాడితే బాగోదని కొందరు చెప్పినా కూడా ఈ సమస్యతో చాలా ఇబ్బంది ఉండడంతో ప్రస్తావిస్తున్నట్లు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు వివరించారు. బడ్జెట్‌ కేటాయింపులపై ఆయన స్పందిస్తూ.. 'బడ్జెట్‌లో చాలా శాఖలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని చూపించారు. ఇది సాధ్యమేనా?' అని సందేహం వ్యక్తం చేశారు. 'ఇంత ఆదాయం వస్తుంటే మరి అప్పులు ఎందుకు' అని ప్రశ్నించారు. 'స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల నుంచి రూ.4 వేల కోట్లు పెంచి చూపించారు. ఇది ఎలా సాధ్యమో వివరించాలి' అని విజ్ఞప్తి చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి