phone call harassment female employees in srikakulam: ఓ ఆజ్ఞాత వ్యక్తి  ఫోన్ కాల్ శ్రీకాకుళం జిల్లా(srikakulam District) వాసులను కలవరపెడుతోంది. మహిళలను టార్గెట్ చేస్తూ..ఓ వ్యక్తి ఉన్నతాధికారినంటూ ఫోన్ చేస్తాడు..ఉద్యోగాలు, ప్రమోషన్ల పేరుతో ఎరవేస్తాడు. ఫోటోలు కావాలని అడుగుతాడు. నమ్మారంటే బుక్కైపోయినట్టే. జిల్లాలోని సారవకోట, మెళియాపుట్టి మండలాల్లో ఈ వ్యవహారం బయటపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సారవకోట(Saravakota) మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక మహిళకు నంబర్‌ నుంచి ఈ నెల 3న ఫోన్‌ కాల్‌(Phone Call) వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి మహిళతో మాటామాటా కలిపి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆమె మరుసటి రోజు సారవకోట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 8న మండలంలోని మరో గ్రామానికి చెందిన నలుగురు మహిళా వాలంటీర్ల(Women Volunteers)కు అదే నంబర్‌తో ఫోన్‌ వచ్చింది. తాను కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నానని.. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తున్నారని నమ్మబలికాడు. ఆ పోస్టులు వచ్చేలా చూస్తానని చెప్పి మాయ మాటలు చెప్పాడు. దరఖాస్తు చేసుకునేందుకు ఫొటో ఇవ్వాలని కోరడంతో ఆ వాలంటీర్లకు అనుమానం వచ్చి ఫోన్‌ కట్‌ చేశారు. మరో మహిళా పోలీసుకు ఇలాంటి ఫోన్ వచ్చింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Also Read:నేతన్నలకు జగన్ సర్కారు శుభవార్త...ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24వేలు!


మెళియాపుట్టి(Meliaputti) మండలంలో మూడు నెలల కిందట పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలకు కూడా పీడీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని ఫోన్‌ చేసి మీకు ప్రమోషన్లు ఇప్పిస్తానని, వేరే చోటకు బదిలీ చేయిస్తానని నమ్మబలికి వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నించారు. గుడ్డు, పాలు లబ్ధిదారులకు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారని మరికొంత మందికి ఫోన్‌‌లు వచ్చాయి. వారిని  బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రయత్నం జరిగింది.


ఒంటరి మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, ఏఎన్‌ఎంలతో తాను ఉన్నతాధికారినంటూ నమ్మబలికి బెదిరిస్తున్నాడు. అనుమానం వచ్చి ఇంటిలో మగవారితో తిరిగి ఫోన్‌ చేయిస్తే తిట్ల పురాణం అందుకుంటూ ఫోన్‌ ఆఫ్‌ చేస్తున్నాడు. మహిళా ఉద్యోగుల(Women Employees)కు ఎప్పటి నుంచో ఈ ఫోన్‌ కాల్‌ వేధింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికీ చెప్పుకోలేక చాలా కాలంగా సతమతమవుతున్నారట. ఓ గ్రామానికి చెందిన ఒంటరి మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook