ఏపీ, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కలలు, ఆకాంక్షలు సాకారం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
అలానే ఏపీ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. నవ్యాంధ్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
నష్టాన్ని కష్టంతో పూరిస్తాం: బాబు
అశాస్త్రీయ విభజనతో ఏపీకి జరిగిన నష్ట్రాన్ని కష్టంతో పూడుస్తామని చంద్రబాబు అన్నారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్ష ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. కుట్రలు, వివక్షపై సంఘటితంగా ధర్మపోరాటం చేస్తామని ప్రమాణం చేయించారు, వారం రోజులు వేరువేరు అంశాలపై జరిగే దీక్షల్లో అన్ని వర్గాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. హామీలు, హోదా విషయంలో కేంద్రం ఏపీని నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు తెలుగు జాతికి జీవనాడి అని అన్నారు.
అమరుల స్థూపానికి నివాళులర్పించిన కేసీఆర్
హైదరాబాద్ నగరంలోని తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్క్ దగ్గర అమరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాలుగేళ్ల పురోగతిని వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.