ఏపీ సీఎం చంద్రబాబుకు మోడీ నుంచి గ్రీటింగ్స్ అందాయి. ఒకవైపు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న చంద్రబాబుకు మోడీ నుంచి గ్రీటింగ్స్ ఏంటి అనుకుంటున్నారా ?. అదేనండి ఈ రోజు మన ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే . ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆయన కు విష్ చేశారు.  ఆయన మాటల్లో చెప్పాలంటే... భగవంతుడు చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మోడీ ట్విట్టర్ ఖాతా ద్వారా విష్ చేశారు.
 





ఒకవైపు తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఏపీ సీఎం చంద్రబాబు మోడీ సర్కార్ పై పోరాటం చేస్తున్న సమయంలో మోడీ ఇలా విష్ చేయడం గమనార్హం. మోడీ హుందాతనానికి ఇది నిదర్శనమని బీజేపీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా విష్ ను లైట్ తీసుకున్నారు  తెలుగు తమ్ముళ్లు.