PM Narendra Modi virtual meet with states CM's 11th jan: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ, స్టోరేజ్, తదితర విషయాలపై జనవరి 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ ద్వారా సమావేశం కానున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 4గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అవుతారని అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ (Coronavirus Vaccine) పంపిణీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, రవాణా వంటి ప్రధాన అంశాలపై ప్రధాని మోదీ.. సీఎంలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. Also Read: COVID-19 Vaccine: ప్రతీ భారతీయుడికి గర్వకారణం: ప్రధాని మోదీ


ఇప్పటికే డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) కోవిషీల్డ్‌, కోవ్యాక్సిన్ (covaxin, covishield) వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలి దశలో 30 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు పలు నగరాల్లో వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన ఏర్పాట్లను సైతం కేంద్రం పూర్తి చేసింది. Also read: COVID-19 Vaccine: తొలి టీకాను ప్రధాని మోదీ తీసుకోవాలి: ఆర్జేడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook