COVID-19 Vaccine: తొలి టీకాను ప్రధాని మోదీ తీసుకోవాలి: ఆర్జేడీ

క‌రోనావైరస్ (Coronavirus) మ‌హ‌మ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది. ఈ క్రమంలో మ‌రో నాలుగైదు రోజుల్లో దేశ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌బోతున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2021, 02:42 PM IST
  • క‌రోనావైరస్ (Coronavirus) మ‌హ‌మ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది.
  • ఈ నేప‌థ్యంలోనే మరో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ (Rashtriya Janata Dal) వ్యాక్సిన్ ప‌నితీరుపై మ‌రోసారి అనుమానం వ్య‌క్తం చేసింది.
COVID-19 Vaccine: తొలి టీకాను ప్రధాని మోదీ తీసుకోవాలి: ఆర్జేడీ

RJD leader Tej Pratap Yadav: పాట్నా: క‌రోనావైరస్ (Coronavirus) మ‌హ‌మ్మారి అరికట్టేందుకు వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం దేశమంతటా కొనసాగుతోంది. ఈ క్రమంలో మ‌రో నాలుగైదు రోజుల్లో దేశ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌బోతున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. తమిళనాడు (Tamila Nadu)లో జరుగుతున్న వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని హర్షవర్ధన్ శుక్రవారం పరిశీలించారు. 

ఈ నేప‌థ్యంలోనే మరో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ (Rashtriya Janata Dal) వ్యాక్సిన్ ప‌నితీరుపై మ‌రోసారి అనుమానం వ్య‌క్తం చేసింది. వ్యాక్సిన్‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం చేకూరాలంటే.. (COVID-19 vaccine) తొలి టీకాను ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ (Narendra Modi) తీసుకోవాల‌ని రాష్ట్రీయ జనతదళ్ (RJD) ముఖ్య నేత తేజ్‌ప్ర‌తాప్ యాద‌వ్ (Tej Pratap Yadav) డిమాండ్ చేశారు. ప్ర‌ధాని మోదీ టీకా తీసుకున్న త‌ర్వాత‌ తాము కూడా టీకా తీసుకుంటామ‌ని తేజ్‌ ప్ర‌తాప్ వార్త సంస్థ ఏఎన్ఐతో పేర్కొన్నారు. Also Read: COVID-19 Vaccine: ప్రతీ భారతీయుడికి గర్వకారణం: ప్రధాని మోదీ

ఇదిలాఉంటే.. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు దేశీయంగా అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో సహా, ఎస్పీ, పలు పార్టీలు దేశీయంగా తయారు చేసిన టీకాలపై పలు అనుమానాలను వ్యక్తంచేశాయి. ఈ క్రమంలో తేజ్ ప్రతాప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మరోసారి వ్యాక్సిన్‌పై ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీల మధ్య దుమారం నెలకొంది. Also Read: COVID-19 Vaccine: కోవిషీల్డ్, కోవ్యాక్సిన్‌కు డీజీసీఐ గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News