Polavaram Dam works: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు శరవేకంగా జరుగుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న డిజైన్లను డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ ఓ కొలిక్కి తీసుకొచ్చింది. మార్చ్ 15లోగా అన్నీ ఆమోదం పొందుతాయని ప్యానెల్ స్పష్టం చేసింది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని వెల్లడించింది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ కమిటీ రెండ్రోజుల క్షేత్రస్థాయి పర్యటన, సమీక్ష పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లు అన్నింటినీ డీడీఆర్పీ ఓ కొలిక్కి తెచ్చింది. పూణేలో సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ ( Central water and power research station )లో 3–డీ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టు ద్వారా అధిక ఒత్తిడితో నీటిని పంపుతూ ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఆ వరద చూపిన ప్రభావాలను పరిశీలించిన డీడీఆర్పీ సభ్యులు.. వాటిని శుక్రవారం క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులతో సరిచూసుకున్నారు. అనంతరం రాజమండ్రిలో పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) అథారిటీ అధికారులతో సమావేశమై సమీక్షించారు. 


గోదావరి నదీ ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి 6 వందల మీటర్ల వెడల్పుతో అప్రోచ్‌ ఛానల్‌ను తవ్వేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌లో మరోసారి ప్రయోగాలు నిర్వహించాక అప్రోచ్‌ ఛానల్‌ గైడ్‌ బండ్‌ డిజైన్‌కు తుదిరూపు ఇస్తామన్నారు. ఈ సీజన్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీ ప్రదేశాలను భర్తీచేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే( Polavaram spillway )మీదుగా మళ్లించాలని డీడీఆర్పీ( Dam design review panel )ఛైర్మన్  పాండ్యా సూచించారు. స్పిల్‌ వే మీదుగా విడుదల చేసిన వరద నీటి ఉధృతి గోదావరి ఎడమ గట్టు  , కుడి గట్టులపై చూపే ప్రభావం ఆధారంగా.. వాటిని పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్ ( Polavaram designs )‌ను ఖరారు చేశారు. ఇక చేయాల్సిన పనులకు ఏమాత్రం ఆటంకం కలగకుండా డిజైన్లను ఖరారు చేసేందుకు పెండింగ్‌లో ఉన్న 29 డిజైన్లను మార్చి 15 నాటికి సీడబ్ల్యూసీతో ఆమోదింపజేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తామని కమిటీ హామీ ఇచ్చింది. 


పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులు ప్రభుత్వం అనుకున్నట్టే 2022 నాటికి పూర్తవుతాయని డీడీఆర్పీ చైర్మన్‌ ఏబీ పాండ్య తెలిపారు. ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. పోలవరం స్పిల్‌ వే నిర్మాణంలో కీలకమైన 192 గడ్డర్ల అమరిక ఇవాళ్టితో పూర్తయిందన్నారు. స్పిల్‌ వే బ్రిడ్జి 1128 మీటర్లకుగానూ 1105 మీటర్లు పూర్తయిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అమర్చుతున్న గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవని ఆయన వెల్లడించారు. స్పిల్‌ వేకు 48 గేట్లకుగానూ ఇప్పటికే 29 గేట్లను అమర్చారని పాండ్య చెప్పారు. గేట్లకు హైడ్రాలిక్‌ సిలిండర్లు, పవర్‌ ప్యాక్‌లు అమర్చే పనులు వేగంగా ..సంతృప్తికరంగా జరుగుతున్నాయన్నారు. 


Also read: AP Panchayat Elections 2021: ఓటు వేసేందుకు వచ్చి స్పృహ తప్పి పడిపోయిన సర్పంచి అభ్యర్థి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook