Police Commemoration Day 2021 AP CM YS Jagan Mohan Reddy tells good news to AP police: ఏపీలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day) జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy ) హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్.. తర్వాత అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : 100 crore vaccination: నేడు 100 కోట్ల డోసులకు చేరనున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌


గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. గతేడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. అందులో ఏపీకి చెందిన వారు 11 మంది ఉన్నారని సీఎం జగన్ (CM YS Jagan) చెప్పారు. ఆ అమరవీరులందరికి నేడు ఏపీ ప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఇక పోలీసుల (police) బాగోగుల గురించి ఆలోచించి, దేశంలోనే మొట్టమొదటిగా వారికి వీక్లీఆఫ్‌ (weekly off) ప్రకటించిన ప్రభుత్వం ఏపీదే అని సీఎం జగన్ తెలిపారు. కోవిడ్‌ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయామని.. మళ్లీ ఇప్పుడు వైరస్‌ ప్రభావం తగ్గింది కాబట్టి నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు సీఎం జగన్‌. 


అలాగే పోలీసు శాఖలో (Police Department) భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామని జగన్ స్పష్టం చేశారు. కోవిడ్‌ వల్ల చనిపోయిన పోలీసులకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశామని సీఎం జగన్ (CM YS Jagan) తెలిపారు.


Also Read : Vallabhaneni Vamsi slams Lokesh: లోకేశ్‌కు మ్యాటర్‌ లేదు: వల్లభనేని వంశీ ఫైర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి