Rayachoti Incident: రాయచోటిలో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయని జరిగిన ప్రచారం తప్పు అని పోలీసులు ప్రకటించారు. ఒక వర్గం వెళ్లిన తర్వాత ఒక వర్గం పోలీసులతో అభ్యంతరం వ్యక్తం చేసిందని వివరణ ఇచ్చారు. రాయచోటిలో జరిగింది సున్నితమైన అంశం.. కానీ తప్పుగా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. తప్పుడు ప్రచారం చేసే వారిని వదలిపెట్టమని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Vijaysai Reddy: కూటమి తప్పుడు ఆరోపణలపై విజయసాయిరెడ్డి కౌంటర్.. చంద్రబాబు సమాధానం ఏంటో..?


అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ విద్యాసాగర్‌ మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన రాయచోటిలో ఓ పూజా కార్యక్రమానికి మరో వర్గం వారు అభ్యంతరం తెలిపారు. ఆ రోజు ఇరువర్గాల పెద్దలు రోడ్లమీదకు వచ్చి ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదని కొందరు ఆకతాయిల అత్యుత్సాహం చేశారని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని చెప్పారు. అనంతరం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు.

Also Read: Rain Alert: మరో అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు వర్షసూచన


సున్నితమైన అంశాన్ని చాలామంది వ్యక్తులు సోషల్ మీడియాలో భక్తుల మీద దాడులు దాడి చేసినట్లు.. భక్తులు వెళ్తున్న బస్సును మొత్తం పగలగొట్టారని తప్పుడు కథనాలు వ్యాప్తి చేశారని ఎస్పీ విద్యాసాగర్‌ తెలిపారు. రాయచోటిలో ఇరువర్గాలు కొట్టుకోలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టమని చెప్పారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని గుర్తించేందుకు పోలీసు సోషల్ మీడియాను రంగంలోకి దింపామని వివరించారు. అత్యాధునిక డ్రోన్ ల ద్వారా సమాచారం సేకరించాం వీరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.


రాజకీయంగా.. ఇతర కారణాలతో.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా వేదికలలో తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని.. ఇప్పటికే వారిని గుర్తించినట్లు ఎస్పీ విద్యాసాగర్‌ తెలిపారు. ఏ మనిషిని కించపరిచినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరి ఆకతాయిల మాటలు నమ్మి మోసపోవద్దని.. ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చేవారి వివరాలు అందిస్తే గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 


Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.