Vijaysai Reddy: కూటమి తప్పుడు ఆరోపణలపై విజయసాయిరెడ్డి కౌంటర్.. చంద్రబాబు సమాధానం ఏంటో..?

Vijaysai Reddy Viral Tweet: గతంలో వైసిపి పార్టీపై అలాగే విజయసాయిరెడ్డి పై చంద్రబాబు చేసిన తప్పుడు ఆరోపణలను ఎండ గడుతూ.. తాజాగా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం ట్విట్టర్లో ఆయన పెట్టిన ట్విట్ తెగ వైరల్ అవుతూ.. టిడిపి అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి.. విజయ్ సాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు అంటూ.. వైయస్సార్సీపీ నేతలు ఈట్ వీక్ ని షేర్ చేస్తున్నారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 8, 2024, 06:27 PM IST
Vijaysai Reddy: కూటమి తప్పుడు ఆరోపణలపై విజయసాయిరెడ్డి కౌంటర్.. చంద్రబాబు సమాధానం ఏంటో..?

Vijaysai Reddy tweet on Alliance:

ప్రతిపక్ష నేత మాజీ మంత్రి విజయసాయిరెడ్డి తాజాగా తనపై ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గట్టి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తన అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా తనపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి అని చంద్రబాబును ట్యాగ్ ను చేశారు.

 

విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా ఇలా రాసుకు వచ్చారు.. “నాపై చేసిన ఆరోపణలకు ఇప్పుడు సమాధానం చెప్పు చంద్రబాబు. అసలు ఈ నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా..? చంద్రబాబు కుట్ర రాజకీయాల్లో భాగంగా విశాఖ కంటైనర్ లో వెయ్యి టన్నుల డ్రగ్స్ దొరికిందని, రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని ఓటర్లను మోసగించడానికి పోలింగ్ కి కేవలం నెలన్నర ముందు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాడు. 

 

 

ఈ విషయంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. దర్యాప్తు చేపట్టగా ఆ కంటైనర్ లో డ్రగ్స్ లేవని స్పష్టం చేసింది. ఇక బ్రెజిల్ అధ్యక్షుడికి నాకు లింకు పెట్టి మరీ అప్పుడు తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు, అతని పచ్చ కుల మీడియా ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది,” అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక ప్రస్తుతం విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

2021 అక్టోబర్ లో విజయవాడ, కాకినాడ మీదుగా లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రవాణాపై.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మౌనం వీడాలని అప్పటి ప్రతిపక్ష,  ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేత బుద్ధ వెంకన్న డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా తన అల్లుడికి కాకినాడ పోర్టుతో పాటూ పలు ఓడ రేవుల్లో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ పై ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందని కూడా ఉత్తరాంధ్ర ఇన్చార్జి తెలిపారు. 

ఎంపీల రహస్య ఉద్యమాల వెనుక నిజానిజాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలని గతంలో ఆయన తెలిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా డబ్బు సులభంగా రావడం కోసం ఆంధ్రప్రదేశ్లోని అగ్ర నేతలు డ్రగ్స్ స్మగ్లింగ్ కి  పాల్పడ్డారు అనేది వాస్తవం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పటివరకు సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి నిజా నిజాలు తేలిన తర్వాతే బయటపెట్టాలి అనుకున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది.

Also read: 8th Pay Commission Date: 8వ వేతన సంఘంపై క్లారిటీ వచ్చేసింది, అదిరిపోయేలా పెరగనున్న జీతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News