ట్రైనింగ్ లో తోటి ఉద్యోగి తుపాకీ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్ మృతి..
Gun Misfire: తుపాకీ మిస్‌ఫైర్ అయ్యి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన ఘటన నాందేడ్‌లో చోటుచేసుకుంది. మృతుడు ఏపీకి చెందిన విజయనగరం జిల్లా వాసి.
Gun Misfire: గన్ మిస్‌ఫైర్ అయ్యి ఓ కానిస్టేబుల్(constable) ప్రాణాలు కోల్పోయాడు. ట్రైనింగ్(Police Training) లో ఉండగా తుపాకీ మిస్‌ఫైర్(Gun Misfire) కావడంతో కానిస్టేబుల్ భానుప్రసాద్ మృతి చెందారు. నాందేడ్(Nanded)లో కానిస్టేబుల్‌గా భాను ప్రసాద్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఫైరింగ్ శిక్షణలో భాగంగా.. తోటి ఉద్యోగి తుపాకీ పేలడంతో భానుప్రసాద్ ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు
భాను ప్రసాద్ స్వగ్రామం ఏపీ(Andhra Pradesh)లోని విజయనగరం జిల్లా చింతలబెలగాం. భాను మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొందరు కానిస్టేబుళ్లు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యలకు పాల్పడుతుంటే .. మరి కొందరు ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ కావడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబ సభ్యులను వదిలి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న ఇలాంటి కానిస్టేబుళ్లు మృతి చెందుతుండటం ఆందోళన కలిగించే విషయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook