Vizag Bride Srujana: విశాఖపట్నంలోని మధురవాడలో పెళ్లి తంతు జరుగుతుండగానే వధువు కుప్పకూలిపోయిన ఘటన సంచలనం రేపింది. పెళ్లి మండపం నుంచి హాస్పిటల్ కు తీసుకెళ్లాక.. ఆ నవ వధువు సృజన చికిత్స పొందుతూ చనిపోయింది. సృజన మరణంపై రకరకాల వాదనలు తెరపైకి వచ్చాయి. విషం తీసుకోవడం వల్లే చనిపోయిందనే ప్రచారం జరిగింది. ఆమె కుటుంబ సభ్యులు ఆ ప్రచారాన్ని ఖండించారు. పెళ్లి పనులతో నీరసం వల్లే అనారోగ్యానికి గురైందని చెప్పారు. పెళ్లి ఇష్టం లేకే సృజన ఆత్మహత్యకు పాల్పడిందనే వార్తలు వచ్చాయి. తాజాగా నవ వధులు సృజన మృతి కేసులో మిస్టరీ విడిపోయింది. పెళ్లి ఆపేందుకు ప్రయత్నించి ఆమె చనిపోయిందని విశాఖ పోలీసులు చెప్పారు. సృజన అలా చేయడానికి ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సృజన ఘటనలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. సృజన ఫోన్‌ డేటా, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, కాల్‌ డయల్‌ రికార్డర్‌ ను విశ్లేషించిన పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడు మోహన్ తో ఇన్ స్టాగ్రామ్ లో ఛాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా విచారణ చేయగా ప్రేమ వ్యవహారం తెలిసింది.


విశాఖ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరవాడకు చెందిన మోహన్ ను సృజన ప్రేమించింది. ఇద్దరికి ఇంటర్ లోనే పరిచయం అయింది. వీరిద్దరి మధ్య గత ఏడేళ్లుగా ప్రేమాయణం నడిచింది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ప్రస్తుతం మోహన్ హైదరాబాద్ లో ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు మోహన్ కోరింది సృజన. అయితే ఆర్థికంగా తాను వీక్ గా ఉన్నానని.. సరైన ఉద్యోగం లేదని.. ఇంకొంత సమయం వెయిట్ చేయాలని చెబుతూ వచ్చాడు మోహన్. ఇంతలోనే  సృజనకు పెళ్లి నిశ్చయం చేశారు ఆమె తల్లిదండ్రులు. ఈనెల 11న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంట్లో సెట్ చేసిన పెళ్లి ఇష్టం లేని సృజన.. ఆ పెళ్లి ఆపుతానని మోహన్ కు హామీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే విషం తీసుకుంది. అయితే డోస్ పెరగడంతో ఆమె తీవ్ర అనారోగ్యాని గురై.. హాస్పిటల్ లో చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. చివరికి ప్రేమ వ్యవహారం వల్లే పెళ్లి ఆపేందుకు ప్రయత్నించిన సృజన తనువు చాలించిందని నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు.


READ ALSO: Hyderabad Honour Killing: నీరజ్ హత్యకు పక్కా స్కెచ్.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు


READ ALSO: MLC Ananthababu: తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్సీ అనంతబాబు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook