కరోనాను తరిమికొట్టిన తొలి జిల్లా ‘ప్రకాశం’లా వెలుగుతోంది
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఓ వైపు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా, పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అరుదైన ఘనత సాధించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఓ వైపు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా, పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అరుదైన ఘనత సాధించింది. కరోనా మహమ్మారిని జయించిన జిల్లాగా ప్రకాశం నిలిచింది. ఈ విషయాన్ని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ ఫొటోలు
ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకూ 63 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మే 15వ తేదీ వరకు కరోనా బారి నుంచి 60 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కోవిడ్ నుంచి కోలుకున్నారని ఏపీ వైద్యశాఖ తెలిపింది. దీంతో కరోనా జాడ లేని జిల్లాగా ప్రకాశం నిలిచింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఒక్క యాక్టీవ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం. ఏపీలో తాజాగా 48 కరోనా కేసులు
కాగా, ఏపీలో ఇప్పటివరకూ 2,205 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, చికిత్స అనంతరం 1,353 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఏపీలో కరోనా మహమ్మారి 49 మందిని బలి తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 803 యాక్టీవ్ కేసులున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు