Privilege Committee Action: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై చర్యలు తప్పవా..ప్రివిలేజ్ కమిటీ ఏ శిక్ష విధించనుంది..మహారాష్ట్ర ఘటన ఏపీలో రిపీట్ అవుతుందా..అసలు ప్రివిలేజ్ కమిటీ అధికారాలేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాష్ట్ర శాసనసభ నిర్వహణ, గౌరవానికి లేదా సభ్యుల గౌరవం, వ్యక్తిగతంపై అవమానం లేదా ఆటంకం కల్గించేలా అగౌరవపరిచేలా ప్రయత్నించినప్పుడు..సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు ప్రివిలేజ్ కమిటీ ( Privilege Committee ) కు పూర్తి అధికారాలుంటాయి. ముందుగా సంబంధిత సభ్యులు లేదా శాసనసభ స్పీకర్ ( Assembly Speaker ) కార్యాలయానికి ప్రివిలేజ్ నోటీసు ( Privilege Notices )లు పంపిస్తారు. ఈ నోటీసుల్ని ముందు శాసనసభ స్పీకర్ లేదా విధానసభ ఛైర్మన్ పరిశీలించి..ప్రాధమిక నిర్ధారణ అనంతరం తదుపరి చర్యల కోసం ప్రివిలేజ్ కమిటీకు సిఫారసు చేస్తారు. సాధారణంగా స్పీకర్  ప్రివిలేజ్ కమిటీకు సిఫారసు చేశారంటే..దాదాపు ఆ ఆరోపణలు నిర్ధారణ అయినట్టే. ఒకసారి స్పీకర్ సిఫారసు చేశాక ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకుంటుందనే భావిస్తారు. 


మంత్రులు బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra reddy ) లు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల్ని ( Motion to breach of privileges ) స్పీకర్ తమ్మినేని సీతారామ్ ( Tammineni Sitaram ) పరిశీలించి..ప్రివిలేజ్ కమిటీకు సిఫారసు చేస్తూ పంపించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర గవర్నర్‌కు మంత్రులపై చేసిన ఫిర్యాదులోని అంశాలు తమ గౌరవానికి భంగం కల్గించాయని..బాధ కలిగిందనేది మంత్రుల ఫిర్యాదు సారాంశం. స్పీకర్ సిఫారసు మేరకు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులతో ఆన్‌లైన్‌లో సమావేశమైంది. రూల్ నెంబర్ 173 ప్రకారం దీనిపై చర్చించారు. గతంలో మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితే ఎదురైందని..ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి ( Kakani Govardhan reddy ) గుర్తు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కేసులో ప్రివిలేజ్ కమిటీకు సంపూర్ణ అధికారముంటుంది. ఎవరినైనా పిలిచి సమాధానం కోరే హక్కుంటుంది. ఫిర్యాదులోని తీవ్రత, పరిస్థితిని బట్టి ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకుంటుంది. అరెస్టు చేయించే అధికారం కూడా కమిటీకు ఉంటుంది. మహారాష్ట్రలో అప్పటి ఎన్నికల కమీషనర్‌ను ప్రివిలేజ్ కమిటీ అరెస్టు చేసి జైలుకు పంపించింది. ఇప్పుడీ ఫిర్యాదుపై తదుపరి చర్యలు త్వరలోనే తీసుకుంటామని కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 


Also read: Privilege committee enquiry: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమర్‌పై చర్యలు ప్రారంభించిన స్పీకర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook