Chandrababu go Back: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు విశాఖపట్నంలో చుక్కెదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంకు చేరుకున్న బాబుకు స్థానికుల్నించి నిరసన ఎదురైంది. గో బ్యాక్ నినాదాలిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల (Ap three capitals) ప్రతిపాదన అధికార పార్టీకు కలిసొచ్చేలా కన్పిస్తోంది. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ రాజధాని( Visakhapatnam executive capital)గా ప్రకటించి..తదనుగుణంగా విశాఖపట్నం అభివృద్దికి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఇదే అంశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Ysr congress party)కు లాభించనుందని తెలుస్తోంది. అదే సమయంలో మూడు రాజధానుల్ని వ్యతిరేకించడం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ఇబ్బందిగా మారింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖకు చేరుకున్న చంద్రబాబుకు చుక్కెదురైంది. 


తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) రాకను విశాఖ వాసులు వ్యతిరేకిస్తూ కన్పించారు. గో బ్యాక్ నినాదాలతో( Go Back slogans) ప్లకార్డులు ప్రదర్శించారు. జంక్షన్‌లో నిలబడి నిరసన తెలిపారు. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతే పర్యటన చేయాలని డిమాండ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎంపీకైన విశాఖపట్నంకు చంద్రబాబు వ్యతిరేకిగా ఉన్నారంటూ స్థానికులు కొంతమంది బాబు రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఊహించని ఈ పరిణామంతో చంద్రబాబు అసహనానికి గురయ్యారు. అటు టీడీపీ నేతలకు కూడా ఈ సంఘటన షాక్ ఇచ్చింది. విశాఖ కార్పొరేషన్ చేజిక్కించుకోవాలని పావులు కదుపుతున్న తెలుగుదేశం పార్టీ (Telugu desam party)కు ఈ పరిణామం తీవ్ర ఇబ్బందిగా మారింది. 


Also read: AP High court: ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook