Pulivendula Firing News: పులివెందులలో కాల్పులు.. వివేకా హత్య కేసులో CBI విచారణ ఎదుర్కొన్న వ్యక్తి కాల్పులు
Pulivendula Firing News Updates: పులివెందులలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. భరత్ కుమార్ యాదవ్ జరిపిన కాల్పుల్లో దిలీప్, మహబూబ్ భాషాకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Pulivendula Firing News Updates: పులివెందులలో భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరిపై కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో గతంలో సీబీఐ అధికారుల చేత విచారణ ఎదుర్కొన్న భరత్ కుమార్ యాదవ్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
పులివెందులలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. భరత్ కుమార్ యాదవ్ జరిపిన కాల్పుల్లో దిలీప్, మహబూబ్ భాషాకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భరత్ కుమార్, దిలీప్ మధ్య ఆర్థిక వివాదాలే ఈ ఘటనకు కారణం అయినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో తన ఇంటి వద్ద నుంచి తుపాకీ తీసుకొచ్చిన భరత్ కుమార్ యాదవ్... తనతో వాగ్వీవాదానికి దిగిన ఇద్దరిపై కాల్పులు జరిపినట్టు సమాచారం అందుతోంది.
దిలీప్ కి మద్దతుగా వచ్చిన కారణంగానే అతడి వెంట ఉన్న మహబూబ్ భాషాపైనా భరత్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన భరత్ అక్కడి నుంచి పారిపోగా స్థానికులే బాధితులను పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, దిలీప్‌కి ఛాతిలో బుల్లెట్ గాయాలు కావడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం కడపలోని రిమ్స్‌కి తరలిస్తుండగానే మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులపై భరత్ ఆరోపణలు
వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు పలుమార్లు భరత్ కుమార్ యాదవ్ ని విచారణకు పిలిచి ప్రశ్నించారు. అయితే, భరత్ మాత్రం సీబీఐ అధికారుల వైఖరిని తప్పుపడుతూ వారిపై ప్రత్యారోపణలు చేశారు. అదే భరత్ యాదవ్ తాజాగా కాల్పుల ఘటన కేసులో నిందితుడిగా బుక్ అయ్యాడు. భరత్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భరత్ కుమార్ యాదవ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాల్పులు జరిగిన ప్రాంతం సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఫ్యాక్షన్ పగలకు నిలయంగా పేరొందిన పులివెందులలో కాల్పుల ఘటన అనే వార్త చూసి చాలామంది ఉలిక్కిపడ్డారు.
ఇది కూడా చదవండి : YSRCP: వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. సీఎం జగన్ సీరియస్.. సజ్జలకు చెక్..?
ఇది కూడా చదవండి : Margadarsi Case: శైలజా కిరణ్‌కు 160 సీఆర్పీసీ నోటీసులు, అరెస్టు చేయనున్నారా
ఇది కూడా చదవండి : AP Assembly Speaker Fake Degree Issue: డిగ్రీ లేకుండా మూడేళ్ల ఎల్ఎల్‌బి ఎలా సాధ్యం, తమ్మినేని సీతారాంపై ఫేక్ డిగ్రీ ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK