CM Jagan Mohan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు తమకు తిరుగులేదని ధీమాతో ఉన్న అధికార పార్టీ వైసీపీ.. ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడిపోయింది. పట్టభద్రుల కోటాలో మూడు సీట్లతో పాటు.. ఎమ్మెల్యే కోటాలో ఒక సీటు ఓడిపోవడం వైసీపీలో కలకలం రేగుతోంది. వరుస షాకులతో సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఓటముల పోస్ట్ మార్టమ్ నిర్వహించిన సీఎం జగన్.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ముఖ్యమైన పదవుల్లో ఉన్న కొందరిపై వేటు ఉంటుందనే ప్రచారం తాడేపల్లిలో సాగుతోంది.
ముఖ్యంగా పార్టీలో.. ప్రభుత్వంలో జగన్ తర్వాత అంతా తానై వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సజ్జల వల్లే పార్టీకి నష్టం కల్గుతుందని కొందరు నేతలు సీఎం జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్‌కు సజ్జల రామకృష్ణారెడ్డిపై చాలా కోపం ఉంది. జగన్‌ను కలవనీయకుండా.. అన్నీ తనకే చెప్పుకోవాలంటారని అంటారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఎవరైనా ఆయన మాటే వినాలనే టాక్ కూడా ఉంది. పార్టీ సోషల్ మీడియాను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. దీంతో ఆయన తీరుపై కొందరు నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
సగం మందికిపైగా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల్లో సజ్జలపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నేతల ఫిర్యాదు నేపథ్యంలో సజ్జలను దూరం పెట్టే యోచనలో సీఎం జగన్ ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. సజ్జలపై వ్యతిరేకంగా ఉన్న నేతలను బుజ్జగించి.. వచ్చే ఎన్నికలకు మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జగన్‌కు నెంబర్ టు పొజిషన్‌లో ఎవరినీ ఎక్కువ కాలం ఉంచేందుకు ఆసక్తి చూపరనే టాక్ కూడా ఉంది. మొదట వైవీ సుబ్బారెడ్డి తర్వాత ఉమ్మారెడ్డి, మైసూరారెడ్డి, విజయసాయిరెడ్డి ఇలా వరుసగా సిరీస్ కొనసాగుతోంది. ఇప్పుడు సజ్జల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని వైసీపీలోనే గట్టిగా ప్రచారం జరుగుతోంది.
మరికొందరు ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. జగన్‌కు నీడలా సజ్జల ఉన్నా.. అన్ని ముఖ్యమంత్రి చెప్పినట్లే చేస్తున్నారని అంటున్నారు. సీఎం అనుమతి లేనిదే సజ్జల ఎలాంటి ప్రకటన చేయరని చెబుతున్నారు. సజ్జలను పూర్తిగా నమ్మినందుకే కాస్త ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఈ ప్రచారం అంతా ఉట్టిదేనని స్ఫష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేల వేటు విషయంలో సీఎం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని.. అదే విషయాన్ని సజ్జల మీడియాకు వివరించారని వైసీపీలోని కొందరు నేతలు పేర్కొంటున్నారు. బట్ట కాల్చి మీదేస్తూ.. ప్రతిపక్ష పార్టీల నేతలు చిచ్చు పెట్టాలని చూస్తూ ఇలాంటి ప్రచారానికి తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: CAG Report: కాగ్ సంచలన రిపోర్ట్.. అడగకుండానే ఈ బ్యాంక్‌కు రూ.8,800 కోట్లు ..!
Also Read: IPL 2023: రూమ్ పాస్‌వర్డ్ మర్చిపోయిన సూర్యకుమార్ యాదవ్.. బాలీవుడ్ డైలాగ్స్‌తో సెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి