Punganur Assembly Constituency: ఏపీలోని రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పుంగనూరు అసెంబ్లీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. అసెంబ్లీ సహా ఏ ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గం పేరు పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీటుగా మారింది. ఇక్కడ ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించి.. మరోసారి గెలుపొందేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన 2009 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2014, 2019 జనరల్ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం తరువాత రెండుసార్లు ఈ సీటును ఆ పార్టీనే సొంతం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట పుంగనూరు అసెంబ్లీ కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఆ తరువాత టీడీపీ ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అడ్డగా మారింది. గత మూడు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందిన పెద్దిరెడ్డి బలమైన నేతగా ఎదిగారు. టీడీపీ ఆవిర్భావం ముందు వరకు ఏడుసార్లు ఎన్నికలు జరగ్గా.. 1955లో మాత్రమే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తరువాత కంచుకోటగా మార్చుకుంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు సైకిల్ పార్టీ జెండా ఎగురవేయగా.. కాంగ్రెస్ రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది.


2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి.. 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు. ఆ తరువాత వైసీపీలో చేరిన ఆయన.. 2014లో  ఎన్నికల్లో 31 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో 42 వేల ఓట్ల తేడాతో గెలుపొంది.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినా.. ఈ నియోజకవర్గంలో మాత్రం పెద్దిరెడ్డి హవానే నడుస్తోంది. పెద్దిరెడ్డిపై బలమైన అభ్యర్థిని తయారు చేసేందుకు విపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. 


పుంగనూరు అసెంబ్లీ పరిధిలో పుంగనూరు, సదుం, సోమల, చౌడేపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షలకు పైనే ఉంది. కులాల వారీగా చూసుకుంటే రెడ్లు, ముస్లింలు, బలిజ కులాలు ప్రధానంగా ఉంటాయి. మాల, మాదిగ కులాల ప్రాధాన్యం కూడా ఎక్కువగానే ఉంది. అయితే రాజకీయంగా ఆధిపత్యం మాత్రం రెడ్లదే. మరి పెద్దిరెడ్డికి టీడీపీ చెక్ పెడుతుందా..? మరోసారి వైసీపీ జెండా ఎగురవేస్తుందా..? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.


Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే


Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook