భారతీయ రైల్వేలో అధునాతన సాంకేతికతను సంతరించుకోనుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ సరికొత్త ఆలోచనకు పదునుపెడుతోంది. రైళ్లలోనూ విమానాల్లో మారిదిగా బ్లాక్ మాక్సులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలికాలంలో తరచుగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైలు ప్రమాదాలకు కారణాలు రాబట్టడం కష్టతరంగా మారింది. ఇందుకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్న రైల్వే అధికారులు.. విమానాల మాదిగా బ్లాక్ బాక్సులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.


రైళ్లలో బ్లాక్ బాక్సులు ఏర్పాటు చేస్తే ఇక నుంచి రైలు ప్రమాదాల కారణాల గురించి కచ్చితమైన సమాచారం లభించనుంది. బ్లాక్ బాక్సుల ద్వారా సిబ్బంది పనితీరును, ప్రమాదానికి గల కారణాలపై ఓ నిర్ణయానికి రావడానికి ఆస్కారం లభిస్తుంది. మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాలు ఏవి ప్రమాదానికి కారణమో తెలుసుకోవడానికి ఈ వీడియో లేక వాయిస్‌ రికార్డింగ్‌ వ్యవస్థలు ఉపయోగపడతాయి.  ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్నట్టు పేర్కొన్న రైల్వే అధికారులు...ఈ ప్రాజెక్టు పూర్తయితే దశల వారీగా అన్ని రైళ్లలో ఉపయోగిస్తామంటున్నారు.