తెలుగు రాష్ట్రాల వారికి వేసవి మంట నుంచి కాస్తంత ఉపశమనం దొరకనుంది. మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళఖాతంలో అల్పపీడనం


బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో  దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 36 గంటల్లో ఇది కాస్త వాయుగుండంగా మారనున్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.వాయుగుండం ప్రభావంతో  తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.


రాయలసీమలో పొడి వాతావరణం


రానున్న 48 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో చెదురు ముదురు జల్లులు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అయితే రాయలసీమ జిల్లాల్లో మాత్రం  పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది.