ఇవాళ, రేపు వర్షాలు.. మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం
నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా తెలంగాణ నుంచి రాయలసీమ వరకు అదే ఎత్తులో సమాంతరంగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా తెలంగాణ నుంచి రాయలసీమ వరకు అదే ఎత్తులో సమాంతరంగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉపరిదల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది.
గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న 36 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికితోడు ఉత్తర భారత దేశం నుంచి బలంగా వీస్తున్న చలిగాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలూ వున్నాయని అధికారులు పేర్కొన్నారు.