లండన్ వెళ్లి శాశ్వత భవనాలను పరిశీలించిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఏపీ ప్రభుత్వానికి తన విలువైన సలహాలు ఇచ్చారు. అమరావతి భవనాలు తెలుగువారి ఘనమైన వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కట్టడాలు ఉండాలని సూచించారు. డిజైన్లు అన్ని ప్రాంతాల ప్రజల మనసులకూ దగ్గరగా ఉండేలా చూడాలని తన మనసులో మాటను బయటపెట్టారు. ప్రజలు తమ ప్రాంత వైశిష్టాన్ని ఈ డిజైన్లలో చూసుకోవాలని రాజమౌళి అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమౌళి  సలహాలు...



*  అసెంబ్లీ భవనం ముందు నీటి కొలను ఉండాలని...సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకాంతి నీటిపై పడి, ప్రతిబింబించి భవంతిపై పడేలా నిర్మిస్తే.. అది చూపరులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని.. పున్నమి వేళ అదే మహాద్భుతమవుతుందని రాజమౌళి వివరించారు.


*  దూరం నుంచి చూస్తే ఒకేలా అసెంబ్లీ, హైకోర్టులు కనిపించాలని.. దగ్గరికి వచ్చే కొద్దీ వాటి రూపురేఖలు మారుతూ వేటికవి ప్రత్యేకంగా కనిపించేలా 'ఇంపోజింగ్ బిల్డింగ్' విధానంలో వీటిని కట్టాలని రాజమౌళి సలహా ఇచ్చారు


* చారిత్రకాంశాలను బొమ్మల రూపంలో నిలపాలని, వాటిని ఫొటో తీయగానే వివరాలు వచ్చేలా యాప్స్ తయారు చేయాలని, అమరావతి నిర్మాణానికి తెచ్చిన మట్టి, నీరు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రతి ఒక్కరికీ చెప్పేలా యాప్ ఉండాలని అప్పుడే ప్రతి ప్రాంతం వారూ రాజధానిలో తామూ భాగస్వామ్యమైనామని భావిస్తారని చెప్పారు.


* తెలుగువారి ఘనమైన వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కట్టడాలు ఉండాలని, అన్ని ప్రాంతాల ప్రజల మనసులకూ దగ్గరగా ఉండేలా డిజైన్లు ఉండాలని, వారు తమ ప్రాంత వైశిష్ట్యాన్ని ఈ డిజైన్లలో చూసుకోవాలని అన్నారు. అందుకు శాతకర్ణి వినియోగించిన జెండాలవంటివి అసెంబ్లీకి అన్ని వైపులా ఏర్పాటు చేసి, ప్రజలు వాటిని చూస్తూ తిరిగి వెళ్లేందుకు వీలుగా ఖాళీ స్థలాన్ని వదలాలని సూచించారు. 


అమరావతి భవనాల నిర్మాణంపై సినీ దర్శకుడు  రాజమౌళి ఇచ్చిన సలహాలకు నార్మన్ పోస్టర్స్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.