Lion Attack: వామ్మో.. ఎన్ క్లోజర్ లో దూకి, సింహం ముందు తొడకొట్టిన యువకుడు.. ట్విస్ట్ మాములుగా లేదుగా..
Tirupati: యువకుడు జూ ఎన్ క్లోజర్ లోకి దూకాడు. సింహంతో సెల్ఫీదిగడానికి సిద్ధపడ్డాడు. అంతే కాకుండా సింహం ముందు ఒక్కసారిగా తొడగొట్టాడు. దీంతో ఒక్కసారిగా ఊహించని విషాదం చోటు చేసుకుంది.
Tirupati Zoological Park: సాధారణంగా అందరు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో కలిసి జూలకు ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ రకరకాల జంతువులు ఎన్ క్లోజర్ లలో ఉంటాయి. సింహలు, ఎలుగు బంట్లు, కోతులు, మొసళ్లు , చిరుత పులులు, ఏనుగులు ఉంటాయి. చిన్న, పెద్దా తేడాలేకుండా.. జూలో ఉండే అనేక రకాల జంతువులను చూసి అందరు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మరికొందరు ఆకతాయిలు మాత్రం.. జంతువులను రాళ్లతో కొడుతుంటారు.
Read More: Mahesh Babu: మరో వివాదంలో మహేష్ బాబు సంచలన చిత్రం.. ఇది దెబ్బ మీద దెబ్బ ..
అంతటితో ఆగకుండా.. క్రూర జంతువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికే జూలోని ఎన్ క్లోజర్ లో ఆకతాయిలు ప్రవేశించి, ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా, సింహాల దగ్గరగా వెళ్లడం, వాటిముందు ఇష్టమోచ్చినట్లు ప్రవర్తించిన అనేక ఘటనలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా, మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
చిత్తూరు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తిరుపతిలోని ఎస్వీయూలో ఒక యువకుడు సింహల ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించాడు. అంతే కాకుండా.. సింహంతో సెల్ఫీ దిగడానికి ట్రై చేశాడు. అంతటితో ఆగకుండా సింహం దర్గరకు వెళ్లి తోడకొట్టాడు. దీంతో అది కాస్త యువకుడిపై కోపంతో దూసుకొచ్చింది. ఈ క్రమంలో యువకుడు తప్పించుకునేందుకు చెట్టు ఎక్కాడు. కానీ సింహం అతనిపై దాడిచేసి చంపేసింది.
Read More: Niharika Konidela: అందాల హద్దులు చెరిపేసిన మెగా డాటర్.. నిహారిక లేటెస్ట్ పిక్స్ వైరల్..
అక్కడున్న టూరిస్టులు.. వెంటనే జూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సింహం దాడిలో చనిపోయిన యువకుడు.. రాజస్థాన్ కుచెందిన ప్రహ్లద్ గుర్జార్ గా పోలీసులు గుర్తించారు. అయితే.. దాడిచేసిన సింహన్ని జూ సిబ్బంది ప్రత్యేకంగా ఎన్ క్లోజర్ లో బంధించారు. ఈ ఘటన ప్రశాదవశాత్తు జరిగిందా..?.. కావాలనే యువకుడు ఎన్ క్లోజర్ లోకి దూకాడా..?.. అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు డెడ్ బాడీ లభించలేదని తెలుస్తోంది. ఈ ఘటన మాత్రం తీవ్ర విషాదకరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook