Ram gopal varma case status update: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల పోలీసులు సోషల్ మీడియాల్లో పొస్ట్ లు, ట్రోలింగ్ లపై సీరియస్ అయినట్లు తెలుస్తొంది. గతంలో కూడా కూటమికి చెందిన నేతలపై పోస్టులు పెట్టి నోటికొచ్చినట్లు కామెంట్లు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో రామ్ గోపాల్ వర్మ.. సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ , ఆయన సతీమణి నారా బ్రాహ్మణిలపై కూడా కాంట్రవర్సీ పోస్టులు పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో..ప్రస్తుతం దీనిపై మద్దిపాడు పీఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తమ ఎదుట హజరు కావాలని కూడా పోలీసులు.. ఇది వరకు ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈరోజు రామ్ గోపాల్ వర్మ పోలీసుల ఎదుట హజరు కావాల్సిఉంది. కానీ అనూహ్యంగా ఆయన హజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులకు వాట్సాప్ సందేశాన్ని పంపించినట్లు తెలుస్తొంది. తాను.. వరుస సినిమాల్లో బిజీగా ఉన్నానని.. తనకు ఒక వారం రోజులపాటు గడువు ఇవ్వాలని కూడా కోరారంట. ఆర్జీవీ తరపున ఆయన లాయర్ ఒంగోలు పోలీసులను కలిసి.. రిక్వెస్ట్ లెటర్ ను అధికారులకు అందించారంట.


మరోవైపు..  ఈ ఘటనపై రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ఆర్జీవీ చంద్రబాబు, లోకేష్ ఆయన సతీమణి, పవన్ కళ్యాణ్ లపై ఘోరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రోలింగ్ లకు పాల్పడినట్లు తెలుస్తొంది. దీనిపై చర్యలు తీసుకొవాలని.. తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు సైతం వర్మపై ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.


Read more: Viral Video: నారా వారి పల్లెలో హైటెన్షన్.. చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో ఇదే..


అయితే.. ఆర్జీవీ మరో పిటిషన్ ను ఏపీ హైకొర్టులో దాఖలు చేసినట్లు తెలుస్తొంది. తన అరెస్ట్ పై స్టే ఇవ్వాలని కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంట. దీనిపై విచారణ జరిగిపిన కోర్టు.. పిటిషన్ ను కొట్టివేసిందంట. పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ పిటిషన్ వేసుకొవాలని చెప్పిందంట. ఇదిలా ఉండగా.. ఈనెల 10వ తేదీన ఒంగోలులోని మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.