రామ్‌గోపాల్‌వర్మ ఓ తిక్కలోడు: టీడీపీ ఎంపీ
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఓ తిక్కలోడని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఓ ప్రముఖ మీడియా ఛానల్‌తో అన్నారు
సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఓ తిక్కలోడని టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఓ ప్రముఖ మీడియా ఛానల్‌తో అన్నారు. వర్మ సాధారణంగా ఏదైనా పని చేస్తే అది తన ఇష్టమంటారని.. అలా అనే వ్యక్తికి నేనేమీ చేసినా అడిగే హక్కు లేదని శివప్రసాద్ అన్నారు. ఇటీవలే పార్లమెంటులో మంత్రగాడి వేషం వేసిన శివప్రసాద్‌తో పాటు అతనితో కలిసి నిరసనలు చేసిన మురళీమోహన్, రామ్మోహన్ నాయుడు మొదలైన వారిని జోకర్లుగా సంబోధిస్తూ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్మ ట్వీట్ పై శివప్రసాద్ స్పందించారు.
అంత గొప్ప దర్శకుడైన వర్మకి జోకర్ విలువేంటో తెలుసా? అని అడిగారు. సర్కస్‌లో జోకర్ హీరోలాంటి వాడని శివప్రసాద్ అన్నారు. ఒక కళను తాము ప్రదర్శించినప్పుడు.. దానిని అభినందించకుండా అందులో లోపాలు వెతకడం సరికాదన్నారు. వర్మకు దమ్ముంటే తమపై చేసిన ట్వీట్లనే ప్రధాని మోదీపై చేయాలని శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఒక కళాకారుడిగా తన ప్రయత్నం తాను చేస్తే.. వర్మ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని శివప్రసాద్ తెలిపారు.