AP may get more rain for few days: ఇటీవల భారీ వర్షాలు, వరదల ప్రభావం నుంచి పూర్తిగా (AP Floods) తేలుకోకముందే.. మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని తెలిపింది. అయితే ఉపరితల ఆవర్తనం తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతున్న నేపథ్యంలో రాయలసీ, కోస్తా జిల్లాలకు భారీ వర్ష వర్షాలు తప్పినట్లు (AP rains Forecast) తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది.


ఏపీలో ఇలా..


ఉపరితల ఆవర్తనంతో నేటి నుంచి రాయలసీమ, కోస్తా జిల్లాలో తెలికపాటి జల్లులు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.


మరోవైపు ఈ నెల 29నాటికి దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో 27వ తేదీన కోస్తాలో తేలికపాటు జల్లులతో పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలకు (AP rains forecast) అవకాశమున్నట్లు వివరించింది.


అల్పపీడన ప్రభావంతో నెల 28 నుంచి ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాలో మాత్రం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.


Also read: చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని


Also read: Chiranjeevi: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి: చిరంజీవి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook