3 రాజధానుల బిల్లు ఉపసంహరణకు కారణం ఏంటి..? జగన్ ప్రభుత్వం ముందున్న 4 ఆప్షన్స్
జగన్ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల బిల్లు ఉపసంహరణకు గురించి తెలిసిందే! అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణమేంటి..?? జగన్ ప్రభుత్వం ముందు ఉన్న 4 ఆప్షన్స్ ఏంటో చూడండి.
Reason behind the Withdraws 3 Capitals Law: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును (Withdraws 3 Capitals Law) ఉపసంహరించుకుంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు (AP High Court) త్రిసభ్య ధర్మాసనం ముందు ఆయన వివరాలను నివేదించారు. మరోవైపు సీఎం జగన్ (AP CM Jagan) కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేయనున్నారు.
సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోటానికి అసలు కారణం ఏం అయి ఉంటుందని చర్చ జరుగుతుంది. మూడు రాజధానుల విషయంలో చాలా రకాల రాజకీయ హంగులు ఉన్నాయని, విశాఖ కర్నూలు విషయంలో ఏం జరగబోతుంది అనే అంశాలపై తీవ్ర చర్చ జరుగుతుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ వెనుక అసలు కారణం ఏమి అయి ఉంటుందో సీఎం జగన్ కాసేపట్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది
Also Read: బ్రేకింగ్: నీటి ప్రవాహంలో చిక్కుకున్న బస్సు.. 30 మంది మహిళల ప్రాణాలు కాపాడిన స్థానికులు
చట్ట, న్యాయపరమైన అంశాలతో పాటు, సాంకేతిక అంశాలను కూడా పరిగణించాలని విపక్షం కోర్టుకు తెలిపింది. ఈ విషయంలో అమరావతి (Amaracathi) ప్రజలు కూడా జగన్ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వం నుండి ఈ విషయాలపై సానుకూలత లేకపోవటం కూడా ఒక కారణమని నిపుణుల అభిప్రాయం.
అయితే జగన్ ప్రభ్యత్వానికి ముందు 4 ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి.. అవేంటంటే..??
1) న్యాయపరమైన ఎలాంటి చుక్కులు రాకుండా 3 రాజధానులు అనుకూలంగా కొట్టుట బిల్లు
2) టెక్నీకల్ గా రాజధానుల పేర్లు రాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ
Also Read: వాటే స్టన్నింగ్ క్యాచ్: అరే ఏంట్రా ఈ క్యాచ్.. సోధి సింగిల్ హ్యాండ్.. షాక్‌లో రోహిత్.. వైరల్ వీడియో!
3) పూర్తి స్థాయి రాజధానిగా అమరావతి (Amaravathi)
4) పూర్తి స్థాయి రాజధానిగా విశాఖ (Vishaka)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook