ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాత్రికి ప్రత్యేకంగా కలవనున్నారు. జగన్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టడానికి కారణమేంటి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ( Ap cm ys jagan ) హఠాత్తుగా ఢిల్లీ పర్యటన ( Delhi Tour ) కు వెళ్లారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఇవాళ రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ( Union home minister amit shah ) తో జగన్‌ భేటి కానున్నారు. అనంతరం ఇతర కేంద్రమంత్రులతో ముఖ్యంగా జలశక్తి మంత్రితో సమావేశమయ్యే అవకాశముంది. అమిత్ షాతో భేటీలో పలు కీలక విషయాల్ని చర్చించనున్నట్టు సమాచారం.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించే అవకాశాలున్నాయి.


ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) నిర్ణయించిన మూడు రాజధానుల ( Ap three capital issue ) ఏర్పాటుకు సహకారం అందించాలని అమిత్‌షాను కోరనున్నారు. దీంతోపాటు ఏపిలో ఆలయాలపై దాడులు ( Attacks on temples ) , విగ్రహాల ధ్వంసంపై జరుగుతున్న రాజకీయ దుమారం గురించి చర్చించవచ్చు. ముఖ్యంగా బీజేపీ  ( Bjp ) ఈ విషయంలో రధయాత్రకు సన్నాహాలు చేస్తుండటం దీనికి కారణం. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని జగన్.. హోంమంత్రి అమిత్ షాకు వివరించనున్నారు. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ నివేదిక ఇవ్వనున్నారు. 


Also read: TDP vs YCP: చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook