Recce conducted to kill me Vangaveeti Radha Krishna sensational comments on his murder : టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాజాగా గుడ్లవల్లేరు మండలం చినగొన్నురులో దివంగత వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) విగ్రహావిష్కరించారు రాధా. ఈ సందర్భంగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు వంగవీటి రాధా. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా అన్నారు. తనని ఏదో చేద్దామనుకుని రెక్కీ నిర్వహించారని రాధా చెప్పారు. వంగవీటి రాధా (Vangaveeti Radha Krishna) చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో (AP politics) చర్చకు దారి తీశాయి. అసలు రాధాపై కుట్ర పన్నే అవసరం ఎవరికి ఉందంటూ ఇప్పుడు ఏపీలో చర్చ మొదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాధా ప్రస్తుతం విపక్షపార్టీలో ఉన్నా కూడా ఎప్పుడూ ఏ విషయంలో కూడా పెద్దగా స్పందించింది లేదు. వార్తల్లోకి ఎక్కిందీ లేదు. కానీ తన తండ్రి వర్ధంతి రోజున చేసిన సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఎవరి జోలి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ఉండే వంగవీటి రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ప్రశ్న ఇప్పుడు మొదలైంది. అయితే రాజకీయ వ్యూహంలో భాగంగా రాధాతో ఇలాంటి వ్యాఖ్యలు చేయించారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. 


బెజవాడలో కులాల మధ్య చిచ్చులు రగులుతూ ఉంటాయి. గతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండేది. అప్పట్లో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఉన్న వైరం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపించింది. అయితే ఈ ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేవు. వంగవీటి రాధా టీడీపీలో ఉన్నారు. దేవినేని నెహ్రూ (Devineni Nehru) వారసుడు అవినాష్‌ వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా ఎలాంటి వివాదాలు లేవు. 


Also Read : Shocking Viral Video: మిరాకిల్.. పిడుగుపడ్డా అతను బతికి బయటపడ్డాడు... వీడియో వైరల్


తాజాగా వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు మళ్లీ పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగా మారాయి. వంగవీటి రాధా హత్యకు నిజంగానే కుట్ర జరిగి ఉంటే ఆయన ఎందుకు తనకు తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్న తలెత్తుతోంది. రంగా వర్ధంతి రోజునే ఈ విషయాన్ని ఎందుకు చెప్పారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. తనపై రెక్కీ ఎవరు నిర్వహించారో తెలుసని చెప్పిన రాధా.. వారి విరవాలు మాత్రం వెల్లడించలేదు. ఇక తనకు ఎలాంటి భయంలేదని.. తాను ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటానంటూ పేర్కొన్నాడు రాధా. అలాగే తన హత్యకు కుట్ర పన్నిన వారికి ప్రజలే బుద్ది చెప్తారనడం చూస్తుంటే.. రాధాపై హత్యాకుట్ర పన్నింది రాజకీయ నాయకులనే చర్చ సాగుతోంది.


అయితే మంత్రి కొడాలి నాని, (Kodali Nani) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో రాధా ఈ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) వంగవీటి రాధాను కలిశారు. వీరిద్దరూ కలిసి మంత్రి కొడాలి నానితో కలిసి గుడివాడలో రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే నాని, వంశీ సమక్షంలో వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.


Also Read : Wasim Jaffer - Michael Vaughan: సందుచూసి.. మైఖేల్ వాన్‌ను ఏసుకున్న వసీమ్ జాఫర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook